WhatsApp Chat Lock : వాట్సాప్‌లో మీ చాట్స్ ఈజీగా లాక్ చేయొచ్చు.. ఇక ఎవరూ చూడలేరు.. సింపుల్ ప్రాసెస్..!

WhatsApp Chat Lock : మెటా సొంత యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం మరెన్నో సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. డేటా రిస్క్ ఉండదు. మీ చాట్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. చాట్ లాక్ ఎలా యాక్సస్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

Tech Tips in Telugu

  • వాట్సాప్ చాట్ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా?
  • యూజర్ల కోసం వాట్సాప్ అనేక సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది
  • మీ చాట్‌లను ఇతరులకు కనిపించకుండా హైడ్ చేయొచ్చు

WhatsApp Chat Lock : వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన సెక్యూరిటీ టిప్.. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల డేటా దొంగిలించకుండా ప్రొటెక్ట్ చేసేందుకు అనేక సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. వినియోగదారులు తమ చాట్‌లను ఇతరులకు కనిపించకుండా హైడ్ చేయొచ్చు. మీ చాట్స్ ఇతరులకు కనిపించకూడదని భావిస్తే.. లాక్ చేసి స్పెషల్ ఫోల్డర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

లాక్ చేసిన చాట్‌లు మీ ప్రైమరీ చాట్ లిస్టులో కనిపించవు. అన్‌లాక్ చేసే వరకు హైడ్ అయి ఉంటాయి. లాక్ చేసిన చాట్‌ను ఓపెన్ చేసేందుకు మీ ఫోన్ పాస్‌కోడ్, ఫింగర్ ఫ్రింట్ ఫేస్ ఐడీ లేదా ప్రైవేట్ కోడ్ అవసరం.

అప్పుడు మాత్రమే మీరు ఆ చాట్‌ను యాక్సెస్ చేయగలరు. నోటిఫికేషన్‌లు కూడా ప్రైవేట్‌గా ఉంటాయి. కేవలం సాధారణ అలర్ట్స్ మాత్రమే అందిస్తాయి. పంపినవారిని లేదా మెసేజ్ రివీల్ చేయవు. వాట్సాప్ చాట్‌లను లాక్ చేసే పూర్తి ప్రాసెస్ వివరంగా తెలుసుకుందాం..

Read Also : Amazon Summer Sale 2026 : లగ్జరీ ఫోన్లు.. ఇప్పుడు లోకల్ ధరలో.. ఈ టాప్ రేంజ్ శాంసంగ్ ఫోన్లపై షాకింగ్ డీల్స్..!

చాట్ లాక్‌ ఎలా ఆన్ లేదా ఆఫ్ చేయాలి? :
మీరు గ్రూప్ చాట్‌ల నుంచి మ్యూట్ చేసిన చాట్‌ల వరకు ఏ చాట్‌కైనా చాట్ లాక్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. మీ ఫోన్ టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయకుంటే చాట్‌ను లాక్ చేసే ముందు మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.

  • ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత చాట్‌పై రైట్ క్లిక్ చేయండి.
  • చాట్‌ను లాక్ చేసి అన్‌లాక్ చేయండి.

వెబ్‌లో లాక్ చేసిన చాట్‌ను ఓపెన్ చేయాలంటే ముందుగా మీ ఫోన్‌లో సీక్రెట్ కోడ్‌ను క్రియేట్ చేయాలి. లాక్ చేసిన చాట్‌లోని కాంటాక్ట్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేయలేరు. మీరు వాట్సాప్‌ను బ్యాకప్ చేసి కొత్త ఫోన్‌కు రీస్టోర్ చేసినా మీ లాక్ చాట్‌లు లాక్ అయ్యే ఉంటాయి.

మీ లాక్ చేసిన చాట్‌లను చూడాలన్నా ముందుగా డివైస్ వెరిఫికేషన్‌ను సెటప్ చేయాలి. లాక్ చేసిన చాట్‌ల కోసం మీరు చాట్‌ను అన్‌లాక్ చేయాలి. మీ లాక్ చేసిన చాట్ ఫోల్డర్‌ను సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే కనిపించేలా హైడ్ చేయొచ్చు.

సీక్రెట్ కోడ్‌ను ఎలా క్రియేట్ చేయాలి? :
మీరు మీ చాట్‌లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేయవచ్చు. మీ ఫోన్ పాస్‌కోడ్‌కు మ్యాచ్ కాకుండా చూసుకోండి. అయితే, ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో మీ సొంత సీక్రెట్ కోడ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసిన చాట్‌ను చూడాలంటే ఈ కింది విధంగా ట్రై చేయండి.

  • ముందుగా లాక్ చాట్ మీద క్లిక్ చేయాలి.
  • ఆపై మీ సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత (continue)పై క్లిక్ చేయాలి.