Tech Tips Telugu : మీ స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్ చేశాక హ్యాంగ్ అవుతుందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్త ఫోన్‌లా స్పీడ్ అవుతుంది!

Tech Tips Telugu : స్మార్ట్ ఫోన్ అదేపనిగా హ్యాంగ్ అవుతుందా? అసలు సమస్య మీరు కొత్త అప్ డేట్ ఇన్ స్టాల్ చేసి ఉండొచ్చు.. లేదంటే మీ ఫోన్ యాప్స్ కారణంగా ర్యామ్ ఫుల్ అయి ఉండొచ్చు.. ఎలా ఫిక్స్ చేయాలంటే?

Tech Tips Telugu

  • మీ స్మార్ట్ ఫోన్ తరచుగా హ్యాంగ్ అవుతుందా?
  • సాఫ్ట్ వేర్ అప్‌డేట్ చేశాక ఫోన్ హ్యాంగ్ అవ్వడం కామన్
  • ఈ ట్రిక్స్ ద్వారా మీ ఫోన్ హ్యాంగ్ కాకుండా చేయొచ్చు

Tech Tips Telugu : మీ స్మార్ట్‌ఫోన్ సరిగా పనిచేయడం లేదా? ఫోన్ ఆన్ చేసిన తర్వాత వెంటనే హ్యాంగ్ అవుతుందా? స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రతి ఫోన్ ఇలా హ్యాంగ్ అవ్వడం చాలా కామన్.

మీ బ్రాండ్ ఏదైనా మోడల్ ఏదైనా కొన్నిసార్లు మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవుతుంది. కొన్ని ఫోన్లు ఎక్కువ ఏళ్లు వాడటం (Tech Tips Telugu) ద్వారా హ్యాంగ్ అవుతాయి. కొన్నిసార్లు ఏదైనా టాస్క్ ఓపెన్ చేశాక ఉన్నట్టుండి ఫోన్ హ్యాంగ్ అవుతుంది. మీ స్మార్ట్ ఫోన్‌లో కూడా ఇలాంటి హ్యాకింగ్ సమస్య ఉంటే అది ఎలా ఫిక్స్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాంం.

మీ స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అనేక కారణాలతో మీ ఫోన్ హ్యాంగ్ అవ్వొచ్చు. మీ ఫోన్ ర్యామ్‌ ఫుల్ అయి ఉండొచ్చు లేదంటే అవసరమైన దానికన్నా ఎక్కువ యాప్‌లను రన్ అవుతుండొచ్చు.

మీ ఫోన్‌ను అసలు అప్‌డేట్ చేసి ఉండకపోవచ్చు. మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుందంటే.. ఇందులో ఒక కారణం తప్పనిసరిగా ఉండొచ్చు. ఇంతకీ మీ ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అప్‌డేట్ సాఫ్ట్‌వేర్ :
మీ స్మార్ట్‌ఫోన్‌ నిర్దిష్ట ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అయితే, కంపెనీలు ప్రతి ఏడాది కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌లు రిలీజ్ చేస్తుంటాయి. ఓఎస్‌ అప్‌డేట్‌తో పాటు, కంపెనీలు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా రిలీజ్ చేస్తాయి.

Read Also : CIBIL Score 800 : మీ సిబిల్ స్కోరు ఇలా ఉందా..? మీరు వద్దన్నా బ్యాంకులు పిలిచి లోన్లు ఇస్తాయి.. అది కూడా తక్కువ వడ్డీకే..!

ఈ అప్‌డేట్‌ స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ మేనేజ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. చాలామంది ఈ అప్‌డేట్‌లను పెద్దగా పట్టించుకోరు. ఇలా ఎక్కువ రోజులు ఉంటే కూడా మీ ఫోన్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. మీ ఫోన్ హ్యాంగ్‌ అవ్వడానికి ఇది కూడా కారణం అవుతుంది.

ఆ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి :
అనవసరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయొద్దు. మీ ఫోన్‌లో అవసరం కన్నా ఎక్కువ యాప్స్ ఉంటే ఫోన్ స్పీడ్ ఎఫెక్ట్ అవుతుంది. మీ ఫోన్ హ్యాంగ్‌ అవుతుంది. అవసరం లేని యాప్స్ డిలీట్ చేయడమే బెటర్.

యాప్‌ కూడా అప్‌డేట్ చేయండి :
మీరు అప్‌డేట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫోన్ రన్ అవుతుంది. కానీ, పాత యాప్‌లను అలాగే ఉంచేస్తారు. అన్నీ యాప్స్ అప్‌డేట్ చేసుకోవాలి. అప్‌డేట్ చేయకున్నా మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది.

ర్యామ్ ఫుల్ అయిందా? :
సాధారణంగా ర్యామ్ మెమెరీ పూర్తిగా నిండినప్పుడు కూడా ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అవుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫోన్‌లోని ర్యామ్ కూడా పూర్తిగా నిండిపోతుంది. ర్యామ్ మెమరీని ఫ్రీ చేయడం తప్పనిసరి.

మీ ఫోన్‌ రీసెట్ చేయండి :
ఈ ట్రిక్స్ ట్రై చేసినా ఫలితం లేదా? లాస్ట్ ఆప్షన్ ఇలా ట్రై చేయండి. మీ ఫోన్ ఫాస్ట్ రన్ అవ్వాలంటే ఒకసారి రీసెట్ చేయండి. మీ ఫోన్‌లో ఫొటోలు లేదా వీడియోలు, ఏదైనా వర్క్ ఫైల్స్ ఉంటే వెంటనే ఆ ఫైల్స్ మెమరీ పెన్ డ్రైవ్‌లో సేవ్ చేయండి. రీసెట్ చేశాక కూడా బ్యాకప్ తీయొచ్చు. మీ ఫోన్ రీసెట్ చేయడం ద్వారా ఫోన్ హ్యాంగ్ ఇష్యూ ఫిక్స్ అవుతుంది. కొత్త ఫోన్ లా స్పీడ్ రన్ అవుతుంది.