Tecno POVA 8 5G : ఫోన్‌లకే కొత్త కింగ్.. 8000mAh బ్యాటరీతో టెక్నో పోవా 8 5G ఎంట్రీ.. ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు!

Tecno POVA 8 5G : మిడ్ రేంజ్ పోవా 8 ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, భారీ 8000mAh బ్యాటరీ ఉన్నాయి. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రెడీగా ఉంది.

Tecno POVA 8 5G

  • టెక్నో పోవా నుంచి కిర్రాక్ ఫీచర్లతో కొత్త 5జీ ఫోన్
  • భారీ 8000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌
  • మోటోరోలా, శాంసంగ్, రియల్‌మి ఫోన్లకు గట్టి పోటీ

Tecno POVA 8 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి కొత్త టెక్నో పోవా 8 వచ్చేసింది. పోవా 7కు అప్‌గ్రేడ్‌గా కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ 2 ర్యామ్ స్టోరేజ్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ బ్యాక్ సైడ్ యాప్‌ నోటిఫికేషన్‌ల కోసం కస్టమైజడ్ అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే కూడా ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ 8000mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.

భారత్‌లో పోవా 8 ధర ఎంతంటే? :
ఈ పోవా ఫోన్ బేస్ వేరియంట్‌ (6GB ర్యామ్, 128GB స్టోరేజ్) ధర రూ. 29,999 మాత్రమే. అలాగే, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ (Tecno POVA 8 5G) ధర రూ. 31,999 ఉంటుంది. ఈ ఫోన్‌ 16-బిట్ వైట్, టెర్మినల్ గ్రీన్ ప్లాస్మా ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Samsung Galaxy A27 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ కొత్త 5G ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి ఉంది. ధర పరంగా చూస్తే.. ఈ ఫోన్, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, శాంసంగ్ గెలాక్సీ A36 5జీ, రియల్‌మి 15 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీ ఇస్తుంది.

పోవా 8 స్పెసిఫికేషన్లు :
ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 స్కిన్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.76-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. 950 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ 1500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ అందిస్తుంది.

ఫాస్ట్, మల్టీటాస్కింగ్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో 6nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో పాటు మాలి-G610 ఎంసీ2 జీపీయూ అమర్చారు. ఇందులో స్పెషల్ జీ1 SE1 సిగ్నల్ చిప్‌సెట్‌ కూడా ఉంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. 
ఈ ఫోన్‌లో 50MP సోనీ LYT 600 ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. ఈ ఫోన్ పోర్ట్రెయిట్ మోడ్, టైమ్-ల్యాప్స్, సూపర్ నైట్ మోడ్, వ్లాగ్ మోడ్, డ్యూయల్ వీడియో స్లో మోషన్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

ఎంఐఎల్-ఎస్టీడీ-810H సర్టిఫికేషన్‌ ఉంది. హీట్ తగ్గించేందుకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. 8000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1198.1 గంటల వరకు స్టాండ్‌బై టైమ్, 39.5 గంటల వరకు కాలింగ్ టైమ్, 17.77 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.