Motorola Phones : కొత్త మోటోరోలా ఫోన్లు భలే ఉన్నాయి.. టాప్ 3 మోటోరోలా ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Motorola Phones : మోటోరోలా కొత్త ఫోన్లు భలే ఉన్నాయి.. మోటోరోలా టాప్ 3 స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Motorola Phones : కొత్త మోటోరోలా ఫోన్లు భలే ఉన్నాయి.. టాప్ 3 మోటోరోలా ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Motorola Phones

Updated On : May 14, 2025 / 2:35 PM IST

Motorola Phones : టెక్ మార్కెట్లో చాలా బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి. ఎప్పటికప్పుడూ టాప్ బ్రాండ్ కంపెనీలు కొత్త ఫీచర్లతో తమ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి.

Read Also : Motorola Razr 50 Ultra : ఖతర్నాక్ డిస్కౌంట్.. చౌకైన ధరకే మోటోరోలా మడతబెట్టే ఫోన్.. ఈ ఫోల్డబుల్ ఫోన్ ఇలా కొనేసుకోండి..!

మోటోరోలా కంపెనీ కూడా అంతే స్థాయిలో భారతీయ మార్కెట్లో పాపులర్ అయింది. మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లకు కూడా ఫుల్ డిమాండ్ పెరిగింది.

మీరు కూడా ఈ బ్రాండ్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇదే సరైన సమయం. మోటోరోలా టాప్ 3 ఫోన్లలో ఏ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుంచి అయినా డిస్కౌంట్ ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ టాప్ ఫోన్లలో మీకు నచ్చిన మోటోరోలా ఫోన్ సొంతం చేసుకోండి.

మోటోరోలా G45 5G :
ఈ హ్యాండ్‌సెట్ విషయానికి వస్తే.. 6.5-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. అదే సమయంలో ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16MP కెమెరా అందుబాటులో ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌లో 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6s జనరేషన్ 3 ప్రాసెసర్ ఉన్నాయి. ఇందులో 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. తద్వారా మోటోరోలా ఫోన్ రూ. 14,722కు లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G :
ఈ మోటోరోలా ఫోన్ (1220×2712) పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ అందిస్తుంది. 50MP కెమెరా, 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టును కూడా కలిగి ఉంది.

ఈ ఫోన్‌‌లో బ్లూటూత్, వై-ఫై, GPS, కనెక్టివిటీకి USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. మోటోరోలా ధర రూ. 34,627కు పొందవచ్చు.

మోటోరోలా రేజర్ 50 :
మోటోరోలా రేజర్ 50 ఫోన్ అత్యధికంగా అమ్ముడవుతుంది. ఈ ఫోన్ 6.9-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.

Read Also : OnePlus 13 : వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 13పై బిగ్ డిస్కౌంట్.. తక్కువ ధరలో ఇలా కొనేసుకోండి!

ఇందులో 8GB ర్యామ్, 256GB స్టోరేజీ కూడా పొందొచ్చు. అదే సమయంలో 50MP కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. పవర్ కోసం ఈ ఫోన్ 4200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడే రూ. 54,990కు కొనుగోలు చేయవచ్చు.