OnePlus 13 : వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 13పై బిగ్ డిస్కౌంట్.. తక్కువ ధరలో ఇలా కొనేసుకోండి!
OnePlus 13 : వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ 13 కొనుగోలుపై రూ. 8వేలు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13 Price Drop
OnePlus 13 : కొత్త వన్‌ప్లస్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.8వేల కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు.
Read Also : Vivo T3 Ultra : భలే ఉంది భయ్యా.. అతి తక్కువ ధరలో వివో T3 అల్ట్రా ఫోన్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..!
ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఫోన్. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఆసక్తి ఉంటే.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ ఆఫర్ పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ 13 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 రూ.69,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ.65,999కి లిస్ట్ అయింది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ వన్‌ప్లస్ 13పై రూ.4వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.4,250 తగ్గింపును పొందవచ్చు.
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13 ఫోన్ HDR10+ సపోర్ట్‌తో 6.82-అంగుళాల LTPO 3K డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
హుడ్ కింద ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ 13 ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది. ఇంకా, హ్యాండ్‌సెట్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAhతో అమర్చి ఉంది.