Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రూ.35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్ అయినా లేదా హై-ఎండ్ అయినా మీ నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు. రూ. 35వేల లోపు ధరలో అందుబాటులో ఉండే 3 మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లను పొందవచ్చు. మీరు బడ్జెట్‌తో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఓసారి లుక్కేయండి.
OnePlus Nord 3 5G :
వన్‌ప్లస్ నార్డ్ 3 5G ఫోన్ 6.74-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఒక బిలియన్ కలర్లు, HDR10+, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఇంకా, స్మార్ట్‌ఫోన్ 16GB RAM, 256GB స్టోరేజీతో MediaTek డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 80-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్‌ను ఉపయోగిస్తుంది. అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లతో సహా రూ. 31,749 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ 3 5Gని కొనేసుకోండి.
iQOO Neo 7 Pro 5G ఫోన్ :
ఐక్యూ నియో 7 ప్రో మోడల్ 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 1 బిలియన్ కలర్లు, HDR10+ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్ప్లే 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 ప్రాసెసర్‌తో 12GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. ఇంకా, 120-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. అమెజాన్‌లో రూ. 33,999 ధరకు అందుబాటులో ఉంది.
Honor 90 5G ఫోన్ :
హానర్ 90 5G ఫోన్ 1 బిలియన్ కలర్స్, HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. Snapdragon 7 Gen 1 ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌కు పవర్ అందిస్తుంది. 66-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. 12MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో 200MP ప్రైమరీ కెమెరాను అందిస్తుంది. హానర్ 90 5G సిరీస్ ఫోన్ సొంతం చేసుకోండి.