Top 3 Upcoming Smartphones : సూపర్ ఫోన్లు మావా.. ఈ నెలలో రాబోయే టాప్ 3 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Top 3 Upcoming Smartphones : 2026లో మార్కెట్‌ను షేక్ చేయనున్న 3 స్మార్ట్‌ఫోన్లు ఏంటో తెలుసా? 200MP కెమెరా, 8,400mAh బ్యాటరీతో అద్భుతంగా ఉంటుంది.. పూర్తి వివరాలివే..

Top 3 Upcoming Smartphones

  • 2026లో అదిరిపోయే 3 కొత్త ఫోన్లు..
  • 200MP కెమెరా, 8,400mAh బ్యాటరీతో రచ్చ
  • అతి త్వరలో భారత్‌లోకి 3 పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు
  • కెమెరా, బ్యాటరీ, స్పీడ్‌లో సరికొత్త రికార్డులు..

Top 3 Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇంకొన్ని రోజులు ఆగడం మంచిదేమో.. ఎందుకంటే.. 2026 చివరి నాటికి భారత మార్కెట్లోకి కొన్ని అదిరిపోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా కెమెరా, ప్రాసెసర్, డిస్‌ప్లే, బ్యాటరీ విషయంలో కొత్త టెక్నాలజీతో ఈ ఫోన్లు ఆకట్టుకోనున్నాయి. అందులో మోటోరోలా సిగ్నేచర్ 27, ఐక్యూ 16, షావోమీ 18 ప్రో ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. మోటోరోలా సిగ్నేచర్ 27 :
మోటరోలా నుంచి రాబోతున్న ఈ ప్రీమియం ఫోన్ కెమెరా ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో 50MP సోనీ ప్రైమరీ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం..

Read Also : Top 6 Smart Air Purifiers : రూ.10 వేల లోపే స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లు.. బెడ్‌రూమ్‌లో స్వచ్ఛమైన గాలి కోసం టాప్ 6 మోడల్స్!

సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఇవ్వనున్నారు. 6.8 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా.. స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.

2. ఐక్యూ 16 :
గేమింగ్, స్పీడ్ ఇష్టపడేవారికి ఐక్యూ 16 బెస్ట్ ఆప్షన్ కావొచ్చు. ఇందులో 2K అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ ఉండనుందని సమాచారం. 8,400mAh భారీ బ్యాటరీ మరో స్పెషాలిటీ.. బ్యాక్ సైడ్ 3 50MP కెమెరాలు ఉండే అవకాశం ఉంది. భారత్‌లో డిసెంబర్ మధ్య నాటికి లాంచ్ కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి..

3. షావోమీ 18 ప్రో :
కాంపాక్ట్ డిజైన్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునేవారికి షావోమీ 18 ప్రో అద్భుతంగా ఉంటుంది. 6.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 200MP ప్రైమరీ కెమెరా, 200MP పెరిస్కోప్ కెమెరా ఆకర్షణీయంగా ఉంటాయి. బ్యాక్ సైడ్ సెకండరీ డిస్‌ప్లే కూడా ఉండనుంది. 7,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చు..