×
Ad

Valentine Week 2026 : వాలెంటైన్స్ డే సేల్.. మీ లైఫ్ పార్టనర్ కోసం రూ. 30వేల లోపు టాప్ 5 కెమెరా ఫోన్లు.. ఈ ఫోన్ గిఫ్ట్ ఇవ్వండి!

Valentine Week 2026 : వాలెంటైన్స్ డే కోసం మీ భాగస్వామికి మంచి కెమెరా ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం రూ. 30వేల లోపు ధరలో 5 ఫోన్లు ఉన్నాయి.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

  • Published On : February 14, 2026 / 04:05 PM IST

Top 5 Camera Phones

  • 2026 వాలెంటైన్స్ డే కోసం అద్భుతమైన కెమెరా ఫోన్లు
  • ఈ స్మార్ట్ ఫోన్లపై వాలెంటైన్స్ డే ఆఫర్లు
  • టాప్ 5 కెమెరా ఫోన్లలో మీ ఫేవరెట్ ఫోన్ ఏంటి?
  • రూ. 30వేల లోపు ధరలో ఏ ఫోన్ కొంటారంటే?

Valentine Week 2026 : వాలెంటైన్స్ డే సందర్భంగా మీ లైఫ్ పార్టనర్ లేదా గర్ల్ ఫ్రెండ్ కోసం కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మీ ప్రియమైనవారికి ఫొటోలు తీయడం ఇష్టమైతే వారికోసం మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్‌ కొని గిఫ్ట్ ఇవ్వొచ్చు.

దాదాపు రూ. 30వేల లోపు ధరకే పవర్‌ఫుల్ ఫొటోలు, వీడియోలను రికార్డు చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తాయి. కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ పరంగా మంచి ఫోన్ కోసం చూస్తుంటే ఈ 5 స్మార్ట్‌ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

వివో T4 ప్రో :
వివో T4 ప్రోలో 50MP రియర్ కెమెరాతో పాటు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. 1B కలర్, 5000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. 90W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 6500mAh బ్యాటరీ కూడా ఉంది.

రియల్‌మి 15 :
రియల్‌మి 15లో 50MP + 8MP డ్యూయల్ కెమెరా కాన్ఫిగరేషన్ అందిస్తుంది. 144Hz, 1B కలర్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల OLED స్క్రీన్‌ అందిస్తుంది. రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300+ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 80W ఛార్జర్, 7000mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Valentine’s Day 2026 : వాలెంటైన్స్ డే కోసం రూ. 20వేల లోపు టాప్ 6 స్మార్ట్‌ఫోన్లు.. మీకు ఇష్టమైనవారికి ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారంటే?

నథింగ్ ఫోన్ (3a):
నథింగ్ ఫోన్ (3a) ట్రిపుల్ కెమెరా (50MP + 50MP + 8MP)తో పాటు 32MP సెల్ఫీ కెమెరా అందిస్తుంది. ఈ ఫోన్ నథింగ్ OS 4.0తో రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 50W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 :
మోటోరోలా ఎడ్జ్ 70 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 4800mAh బ్యాటరీతో వస్తుంది. డ్యూయల్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 50MP సెల్ఫీ కెమెరా అందిస్తుంది. 4500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 120Hz రిఫ్రెష్ రేట్, 1B కలర్ ఆప్షన్లతో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లేతో వస్తుంది.

ఒప్పో F31 5జీ :
ఒప్పో F31 5జీ ఫోన్ 16MP ఫ్రంట్ కెమెరా, అసిస్టెంట్ లెన్స్‌తో డ్యూయల్ 50MP కెమెరా సెటప్ అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 సీపీయూ ద్వారా పవర్ పొందుతుంది. 80W ఛార్జర్, 7000mAh బ్యాటరీతో వస్తుంది.