Top 5 Foldable Phones : ఫోల్డ్ చేస్తే ఫ్యూచర్ రెడీ.. రాబోయే టాప్ 5 సూపర్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఐఫోన్ ఫోల్డ్ నుంచి గెలాక్సీ Z ఫోల్డ్ 8 వరకు..
Top 5 Foldable Phones : ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. 2026లో భారత మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో టాప్ 5 ఫోల్డబుల్ ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
- Sreehari A
- Updated on- April 18, 2026 / 05:56 PM IST
Top 5 Foldable Phones
- 2026లో రాబోయే టాప్ 5 సూపర్ ఫోల్డబుల్ ఫోన్లు
- ఐఫోన్ ఫోల్డ్ నుంచి గెలాక్సీ Z ఫోల్డ్ 8 వరకు
- ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించి కీలక అప్ డేట్స్
Top 5 Foldable Phones : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? 2026 ఏడాదిలో సరికొత్త ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లు రాబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఫోల్డబుల్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు డిజైన్, పర్ఫార్మెన్స్ కెమెరాలో కొత్త ఫీచర్లతో గట్టి పోటీనివ్వనున్నాయి.
ఆపిల్ చాలా కాలంగా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ వార్తల నుంచి శాంసంగ్ ఫోల్డబుల్ రేంజ్ విస్తరణ వరకు ఈ ఏడాదిలో రాబోయే ఐదు ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తున్నాం.. ఓసారి లుక్కేయండి..
ఆపిల్ ఐఫోన్ 11 ప్రో మాక్స్ :
ఆపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి ఎంట్రీకి రెడీ అవుతోంది. ఆపిల్ ఐఫోన్ ఫోల్డ్ పేరుతో లాంచ్ చేయనుంది. లీకుల ప్రకారం.. భారీ 7.8-అంగుళాల లోపలి డిస్‌ప్లే, కాంపాక్ట్ ఔట్ స్క్రీన్‌తో ఉండవచ్చు.
ఈ ఫోన్ రాబోయే A20 ప్రో చిప్‌తో రన్ అవుతుంది. ఇందులో టచ్ ఐడీ కూడా తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ 2026 సెప్టెంబర్ రెండో వారంలో ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటుగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
Read Also : PF Withdrawal : వావ్.. ఇక UPI, ATM ద్వారా మీ PF డబ్బులు తీసుకోవచ్చు.. కొత్త లిమిట్ ఎంతో తెలుసా?
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 :
శాంసంగ్ ఫోల్డబుల్ కేటగిరీలో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 రాబోతుంది. ఈ మోడల్‌లో భారీ బ్యాటరీ, మెరుగైన మన్నికతో సహా అనేక ఇంటర్నల్ అప్‌గ్రేడ్‌లు ఉంటాయని అంచనా. అంతేకాదు.. ఎస్ పెన్ సపోర్ట్ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్ :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్ కొత్త వేరియంట్ కూడా మార్కెట్లోకి రాబోతుంది. వెడల్పు ఉండే కవర్ స్క్రీన్ సేమ్ హార్డ్‌వేర్‌తో ఎక్స్ ట్రనల్ డిస్‌ప్లేను ఇష్టపడే యూజర్లను ఆకట్టుకోనుంది. ఈ ఫోన్ శాంసంగ్ అప్ కమింగ్ ఈవెంట్ సందర్భంగా ఆవిష్కరించే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ :
గూగుల్ నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్ కొత్త డిజైన్, అద్భుతమైన కెమెరా సిస్టమ్‌తో వస్తుందని అంచనా. కెమెరా మాడ్యూల్, కొత్త టెన్సర్ G6 చిప్ పర్ఫార్మెన్స్, ఏఐ ఫీచర్లు అత్యంత ఆకర్షణగా ఉండనున్నాయి. ఈ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ 2026 ఆగస్టులో లాంచ్ కావచ్చు.
వివో ఎక్స్ ఫోల్డ్ 6 :
వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్‌లలో కెమెరా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు. లీకుల ప్రకారం.. ఇందులో హై రిజల్యూషన్ ప్రైమరీ కెమెరా, టెలిఫోటో ఉండవచ్చు. అంతేకాదు.. ఫోల్డబుల్ డిజైన్ మరింత సున్నితంగా అడ్వాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ ప్రియులను ఆకర్షిస్తుంది. ఈ వివో ఫోన్ 2026 చివరిలో లాంచ్ కావచ్చు.
