TRAI-Mandated Packs : మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక రీఛార్జ్ ప్లాన్ల కోసం వెతకాల్సిన పని లేదు!
TRAI-Mandated Packs : టెలికాం రీఛార్జ్ ప్లాన్లపై ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెబ్సైట్లు, యాప్‌లలో ‘తప్పనిసరి రీఛార్జ్ ప్యాక్స్’ కోసం స్పెషల్ సెక్షన్ ఏర్పాటు చేయాలని, రీఛార్జ్ ప్లాన్లను స్పష్టంగా యూజర్లకు కనిపించాలే చేయాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది.
TRAI-Mandated Packs
రీఛార్జ్ చేసే ముందు ఇది చూడాల్సిందే.. ట్రాయ్ కొత్త రూల్
జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్
రీఛార్జ్ ప్లాన్లు ఇక దాచలేరు.. టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశం
TRAI-Mandated Packs : మొబైల్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. టెలికాం సేవల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టెలికాం కంపెనీలు తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లలో రీఛార్జ్ ప్లాన్లు, స్పెషల్ టారిఫ్ వోచర్లను కస్టమర్లకు ఈజీగా కనిపించేలా చేయాల్సి ఉంటుంది.
కొన్ని తప్పనిసరి రీఛార్జ్ ప్లాన్లు వెబ్సైట్లు, యాప్‌లలో కనిపించడం లేదంటూ వినియోగదారుల నుంచి వచ్చిన (TRAI-Mandated Packs) ఫిర్యాదుల మేరకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫస్ట్ ట్యాబ్‌లోనే చూపించాలి :
ఇకపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లలో ‘TRAI-Mandated Packs’ పేరుతో స్పెషల్ కేటగిరీ ఏర్పాటు చేయాలి. ట్రాయ్ తప్పనిసరి చేసిన రీఛార్జ్ వోచర్లు, ప్లాన్లను ఈ విభాగంలో స్పష్టంగా చూపించాలి. అలాగే, ప్రీపెయిడ్ రీఛార్జ్ కేటగిరీని ఫస్ట్ ట్యాబ్‌లోనే అందుబాటులో ఉంచాలని ట్రాయ్ ఆదేశించింది.
Read Also : DSC 2.0 Notification : ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు భారీ అప్డేట్.. నెల రోజుల్లోనే నోటిఫికేషన్!
30 రోజుల్లోగా అమలు చేయాలి :
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు టెలికాం కంపెనీలకు చెందిన ఆఫ్‌లైన్ సేల్ సెంటర్లలోనూ అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్లను స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను టెలికాం ఆపరేటర్లు 30 రోజుల్లోగా అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది.
అంతేకాదు.. 30 రోజుల వ్యాలిడిటీతో కాంబో వోచర్, స్పెషల్ టారిఫ్ వోచర్, ప్లాన్ వోచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. ఈ మార్పులతో కస్టమర్లు తమకు అందుబాటులో ఉన్న తప్పనిసరి, స్పెషల్ రీఛార్జ్ ప్లాన్లను ఒకే చోట చూడొచ్చు. రీఛార్జ్ ప్లాన్లకు సంబంధించి వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు.
