Upcoming Smartphones : సెప్టెంబర్ స్మార్ట్‌ఫోన్ జాతర! మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫుల్ లిస్ట్ ఇదే!

Upcoming Smartphones : సెప్టెంబర్‌లో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి. ఐఫోన్ 18 ప్రో సిరీస్ నుంచి రెడ్‌మి 17 5జీ, పోకో F9 సిరీస్ వరకు పలు కొత్త ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. పూర్తి ఫోన్ల లిస్టు ఇదిగో..

Upcoming Smartphones

  • సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో సహా అనేక ఫోన్లు లాంచ్
  • భారత మార్కెట్లో రెడ్‌మి 17 5జీ 7,900mAh బ్యాటరీ సెటప్
  • పోకో F9 సిరీస్‌లో 16GB ర్యామ్, 100W ఛార్జింగ్ ఆప్షన్లు

Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? సెప్టెంబర్ 2026 వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫుల్ సందడి కనిపించనుంది. మీరు కూడా కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఆపిల్, రెడ్‌మి, పోకో, వివో, ఇన్ఫినిక్స్, ఐక్యూ, షావోమీ వంటి మెయిన్ బ్రాండ్‌లు ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి.

ఐఫోన్ 18 ప్రో సిరీస్, ఐఫోన్ అల్ట్రా, రెడ్‌మి 17 5జీ, ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ప్లస్ వంటి ఫోన్లు భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. కొన్ని మోడళ్లు చైనా ప్రపంచ (Upcoming Smartphones) మార్కెట్‌లో కూడా లాంచ్ కానున్నాయి. రాబోయే ఫోన్లకు సంబంధించి పూర్తి లిస్టును ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పైనే ఫోకస్ :
సెప్టెంబర్‌లో ఆపిల్ అతిపెద్ద ఈవెంట్ జరుగనుంది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సెప్టెంబర్ 9న లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్‌లలో A20 ప్రో చిప్‌సెట్, కొత్త కెమెరా సిస్టమ్ చిన్న డైనమిక్ ఐలాండ్ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా.

కెమెరా సెటప్‌లో వేరియబుల్ అపర్చర్ ప్రైమరీ సెన్సార్, అద్భుతమైన టెలిఫోటో కెమెరా 24MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటాయని అంచనా. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 5,500mAh వరకు బ్యాటరీ ఉండొచ్చు. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ల సేల్స్ సెప్టెంబర్ 18న ప్రారంభమవుతాయని అంచనా.

Read Also : Nothing Phone 4a Pro : అదిరే ఆఫర్.. కొత్త నథింగ్ ఫోన్ 4a ప్రో భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ :
ఆపిల్ సెప్టెంబర్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు ఐఫోన్ అల్ట్రాను కూడా ఆవిష్కరించనుంది. కంపెనీ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌ అంటున్నారు. అయితే, ఈ ఫీచర్లు స్పెసిఫికేషన్ల వివరాలు ప్రస్తుతానికి రివీల్ కాలేదు. నివేదికల ప్రకారం.. ఐఫోన్ అల్ట్రాతో సహా కొత్త ఐఫోన్ మోడళ్లు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అమ్మకానికి రావొచ్చు. ఆపిల్ ఈ సమయంలోనే iOS 27 కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

వివో, పోకో రెడ్‌మి ఫోన్లు :

ఈ నెల ఆరంభం నుంచే కొత్త ఫోన్ల సందడి ఉండబోతోంది. పోకో ఎఫ్9 ప్రో, ఎఫ్9 అల్ట్రాలు సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. అయితే, భారత మార్కెట్లో లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. ఆ తర్వాత వివో టి5 5జీ సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

రెడ్‌మి 17 5G కూడా సెప్టెంబర్ 3న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G ప్లస్ ఫోన్ సెప్టెంబర్ 4న లాంచ్ కానుంది. రెడ్‌మి నోట్ 17 ప్రో ప్రో మ్యాక్స్‌లు సెప్టెంబర్ 15న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయని అంచనా..

ఐక్యూ, షావోమీ, వివో నుంచి ఫోన్లు :

సెప్టెంబర్‌లో చైనాలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఐక్యూ 16 సెప్టెంబర్‌లో చైనాలో ఎంట్రీ ఇవ్వనుంది. షావోమీ 18 ప్రో సిరీస్ సెప్టెంబర్ చివరిలో లాంచ్ కానుండగా, షావోమీ 18 ఫోల్డ్ కూడా ఈ నెలలో చైనాలో లాంచ్ కానుంది.

అదనంగా, వివో X500, X500 ప్రో, X500 ప్రో మ్యాక్స్ కూడా సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26 FE కూడా సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి రానుంది. ఈ నెలలో వివిధ కంపెనీల నుంచి అనేక కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి.