Upcoming Smartphones : మొబైల్ లవర్స్ బిగ్ అలర్ట్..! జూన్‌లో ఎంట్రీ ఇవ్వనున్న 5 పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు ఇవే
Upcoming Smartphones : వచ్చే జూన్ 2026లో అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయి. ఇందులో షావోమీ 17T, వన్‌ప్లస్ 15s ఫోన్ వంటి మరెన్నో ఫోన్లు ఉన్నాయి. పూర్తి ఫోన్లపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- May 29, 2026 / 03:50 PM IST
Upcoming Smartphones ( Image Credit : AI )
- జూన్ 2026లో లాంచ్ కానున్న అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు
- మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ నుంచి ఐక్యూ జెడ్11 5జీ వరకు
- ఈ ఫ్లాగ్‌షిప్ నుంచి మిడ్-రేంజ్ ఫోన్ల వరకు ఫీచర్లు ఇవే
Upcoming Smartphones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే జూన్ నెలలో భారత మార్కెట్లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ నుంచి మిడ్-రేంజ్ ఫోన్ల వరకు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. జూన్ 2026లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో మోటోరోలా, షావోమీ, రెడ్‌మి, వన్‌ప్లస్ నుంచి అనేక ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ల ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ (భారత్ లాంచ్) :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ 2026 జూన్‌లో భారత మార్కెట్లో లాంచ్ కానున్న ప్రీమియం (Upcoming Smartphones) స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ చిప్‌సెట్, దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్, హై-ఎండ్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్ల కోసం లాంచ్ చేయొచ్చు.
పాంటోన్ జిన్‌ఫాండెల్, పాంటోన్ సీ, పాంటోన్ చికోరి కాఫీ అనే 3 షేడ్స్‌లో రానున్నట్లు వెల్లడైంది. ఈ 3 వేర్వేరు ఫినిషింగ్ ఉంటాయి. అయితే, మొత్తం డిజైన్, అదే విధమైన కెమెరా లేఅవుట్ ఎడ్జ్ 70 ప్రో మాదిరి ఉంటాయి. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP సోనీ లైటియా 710 సెన్సార్ ఉంటుందని అంచనా.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు కూడా సపోర్టు ఇస్తుంది. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్ అనే మరో సెన్సార్ ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోలో ఇదే సెటప్ ఉంది. అదనంగా అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ప్రో ప్లస్ ఇంకా ధృవీకరించలేదు.
లాంచ్ డేట్ :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ 2026 జూన్ 4న భారత మార్కెట్లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ధృవీకరించింది.
Upcoming Smartphones (Motorola Edge 70 Pro Plus)
ధర (అంచనా) :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్ రూ. 45వేలు లేదా అంతకంటే ఎక్కువ ధరతో మిడ్ రేంజ్ కేటగిరీలో వస్తుందని అంచనా.
షావోమీ 17టీ లాంచ్ :
షావోమీ 17T ఫాస్ట్ ఛార్జింగ్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్-లెవల్ హార్డ్‌వేర్‌తో పర్ఫార్మెన్స్ ప్రీమియం (Upcoming Smartphones) స్మార్ట్‌ఫోన్‌గా రానుంది. జూన్ 2026లో లాంచ్ కానున్న కీలకమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. లీకుల ప్రకారం.. షావోమీ 17T ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియో, ఎల్టీపీఎస్ టెక్నాలజీ, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.59-అంగుళాల (2656×1200 పిక్సెల్స్) 1.5K రిజల్యూషన్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు LPDDR5x ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందిస్తుంది. షావోమీ 17T ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. ఇందులో ఎఫ్/1.67 లైట్ హంటర్ 800 లెన్స్, OIS, ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50MP లైకా ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 12MP లైకా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్, ఎఫ్/2.0 అపర్చర్, OISతో 50MP లైకా పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
షావోమీ 17టీలో 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. కస్టమైజ్డ్ హై-వైబ్రేషన్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, USB-C 3.2 పోర్ట్, NFC,బ్లూటూత్ v6.0, 5G, Wi-Fi7, ఐఆర్ బ్లాస్టర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ లేటెస్ట్ హైపర్ఓఎస్ 3.0 ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ IP68+IP69 రేటింగ్‌తో వస్తుంది.
లాంచ్ డేట్ :
షావోమీ 17T ఫోన్ జూన్ 4, 2026న భారత మార్కెట్లో లాంచ్ కానున్నట్లు వెల్లడైంది.
ధర (అంచనా) :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. భారత మార్కెట్లో షావోమీ 17T ఫోన్ 12GB + 256GB, 12GB + 512GB అనే రెండు మోడళ్లలో లభ్యం కానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 59,999 ఉండవచ్చు.
రెడ్‌మి టర్బో 5 లాంచ్ :
రెడ్‌మి టర్బో 5 పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, ఆకర్షణీయమైన ధరతో రానుంది. జూన్ 2026లో లాంచ్ కానున్న సరసమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. గేమర్‌లు, పవర్ యూజర్‌లు లక్ష్యంగా హై రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ప్రాసెసర్ ఉండవచ్చు.
లీకుల ప్రకారం.. భారత్ రీబ్రాండెడ్ పోకో X8 ప్రోగా రానుంది. ఒకవేళ టర్బో 5 అనేది రీబ్యాడ్జ్ పోకో X8 ప్రో అయితే 6.59-అంగుళాల (2756×1268 పిక్సెల్స్) 1.5K అమోల్డ్ 20:9 డిస్‌ప్లే ఉంటుందని అంచనా. 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, HDR10+, డాల్బీ విజన్, 3840Hz PWM డిమ్మింగ్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, డీసీ డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా SoC ప్రాసెసర్ ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3.0పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB వరకు LPPDR5x ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్, వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండవచ్చు. ఈ ఫోన్ IP66+IP68+IP69+IP69K రేటింగ్ కూడా ఉండవచ్చు.
కెమెరాల విషయానికొస్తే..
ఈ హ్యాండ్‌సెట్‌లో OISతో 50MP సోనీ IMX882 ఎఫ్/1.5 సెన్సార్, 8MP ఎఫ్/2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. సెల్ఫీల కోసం టర్బో 5లో 20MP OV20B ఎఫ్/2.2 సెల్ఫీ కెమెరా ఉండొచ్చు.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5G డ్యూయల్ సిమ్, వైఫై 6, బ్లూటూత్ v5.4, డ్యూయల్-బ్యాండ్ GNSS, ఐఆర్ బ్లాస్టర్, NFC ఉండవచ్చు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-స్క్రీన్ ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6500mAh బ్యాటరీ ఉండవచ్చు.
లాంచ్ తేదీ (అంచనా) :
భారత మార్కెట్లో రెడ్‌మి టర్బో 5 లాంచ్ కానున్నట్లు ధృవీకరించింది. 2026 జూన్ ప్రారంభంలో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
ధర (అంచనా) :
రెడ్‌మి టర్బో 5 మిడ్ రేంజ్ కేటగిరీలో పోటీ ధరతో సుమారు రూ. 35వేల లోపు ఉంటుందని అంచనా.
వన్‌ప్లస్ 15s లాంచ్ :
ఈ నెలాఖరులోగా జూన్ 2026లో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్ల లిస్టులో వన్‌ప్లస్ 15s చేరనుందని పుకార్లు వినిపిస్తున్నాయి. వన్‌ప్లస్ టాప్ రేంజ్ మోడళ్ల కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, ఆక్సిజన్‌ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని భావిస్తున్నారు.
వన్‌ప్లస్ 15s అనేది చైనా రీబ్యాడ్జ్డ్ 15T, 15Sలో కూడా 15T స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వన్‌ప్లస్ 15టీ ఫోన్ 165Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ వరకు గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, 10-బిట్ కలర్స్, డాల్బీ విజన్, 100శాతం DCI-P3, 460 పీపీఐతో 6.32-అంగుళాల (2640×1216 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు 16GB వరకు LPDDR5x ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఎఫ్/1.8 అపర్చర్, OIS, 10-బిట్ HDRతో 50ఎంపీ సోనీ IMX906 ప్రైమరీ కెమెరాతో OIS, ఎఫ్/2.8 అపర్చర్ , ఆటో-ఫోకస్, 3.5x ఆప్టికల్ జూమ్, 120x వరకు డిజిటల్ జూమ్‌తో 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో సెన్సార్ ఉంది.
ఫ్రంట్ సైడ్ 16ఎంపీ ఎఫ్/2.4 సెన్సార్ ఉంది. ఈ ఫోన్ 7500mAh బ్యాటరీ ఉంది. 100W SuperVOOC ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం 5జీ SA/NSA, Wi-Fi 7 (802.11be), బ్లూటూత్ v6.0, డ్యూయల్-యాంటెన్నా NFC, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
వన్‌ప్లస్ 15టీలో డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్, అలాగే ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. 4 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి.
లాంచ్ తేదీ (అంచనా) :
వన్‌ప్లస్ 15s 2026 జూన్ నెలాఖరు నాటికి భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
ధర (అంచనా) :
వన్‌ప్లస్ 15s ప్రీమియం సెగ్మెంట్‌లో ధర సుమారు రూ. 60వేలు ఉండవచ్చని అంచనా.
