×
Ad

UPI Transaction Limit : బిగ్ అలర్ట్.. యూపీఐ పేమెంట్ అవ్వడం లేదా? UPI డైలీ లిమిట్ పెంచుకోండిలా? ఇదిగో సింపుల్ ప్రాసెస్

UPI Transaction Limit : యూపీఐ లావాదేవీలకు రోజువారీ లిమిట్ సాధారణంగా రూ. లక్ష ఉంటుంది. బ్యాంక్, NPCI నిబంధనలను బట్టి లిమిట్ పెంచవచ్చు. కేవైసీ పూర్తి చేసి, బ్యాంకు నుంచి రిక్వెస్ట్ పొందవచ్చు. అది ఎలాగంటే?

  • Published On : February 16, 2026 / 05:08 PM IST

UPI Transaction Limit

  • యూపీఐ పేమెంట్లు చేయలేకపోతున్నారా?
  • యూపీఐ పేమెంట్ లిమిట్ ఎంత ఉందో చెక్ చేశారా?
  • యూపీఐ డైలీ లిమిట్ లిమిట్ దాటితే పేమెంట్ చేయలేరు

UPI Transaction Limit : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. యూపీఐ పేమెంట్ల విషయంలో చాలామందికి ఎదురయ్యే సమస్య పేమెంట్ లిమిట్.. ప్రస్తుత డిజిటల్ పేమెంట్ల యుగంలో, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) అత్యంత పాపులర్ అయింది. ప్రతిరోజూ, లక్షలాది మంది అద్దె, పాఠశాల ఫీజులు, టికెట్ బుకింగ్‌లు, షాపింగ్ వంటి ముఖ్యమైన పేమెంట్ల కోసం యూపీఐ ఉపయోగిస్తున్నారు.

అయితే, కొన్నిసార్లు, పెద్ద మొత్తంలో లావాదేవీల సమయంలో యాప్ అకస్మాత్తుగా ‘Your Limit Exhausted’ అనే మెసేజ్ కనిపిస్తుంది. యూపీఐ కూడా రోజువారీ లిమిట్ ఉంటుంది. ఇలాంటి సమయంలో యూపీఐ యూజర్లు ఏం చేయాలి? యూపీఐ లిమిట్ పెంచుకోవడం ఎలా అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

యూపీఐ లిమిట్ ఎంతంటే? :
సాధారణ కస్టమర్లకు చాలా బ్యాంకులు రోజుకు రూ. లక్ష యూపీఐ లిమిట్ అందిస్తున్నాయి. ఈ లిమిట్ ప్రతి 24 గంటలకు రీసెట్ అవుతుంది. అయితే, ఈ లిమిట్ యాప్‌పై మాత్రమే ఆధారపడి ఉండదు. కానీ, 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్ పీసీఐ నిబంధనలు, మీ బ్యాంక్ ఇంటర్నల్ లిమిట్స్, కొన్నిసార్లు యాప్-లెవల్ కంట్రోలింగ్ వంటివి ఉంటాయి.

యూపీఐ హై లిమిట్స్ ఎప్పుడంటే? :
ఐపీఓ అప్లికేషన్లు, పన్ను చెల్లింపులు, పాఠశాల లేదా ఆసుపత్రి ఫీజులు, ప్రభుత్వ లావాదేవీలు వంటి కొన్ని కేటగిరీలకు ఈ యూపీఐ లిమిట్ రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. అయితే, మీ బ్యాంక్ ఆ లావాదేవీకి హై లిమిట్స్ అనుమతిస్తేనే పేమెంట్ చేయగలరు.

యూపీఐ లిమిట్ ఎందుకు తగ్గుతుంది? :
మీరు ఇటీవల కొత్త బ్యాంక్ అకౌంట్ యూపీఐకి లింక్ చేసి ఉంటే మీ ఫోన్ నంబర్‌ మార్చి ఉంటే లేదా ఫస్ట్ టైమ్ యూపీఐ యాక్టివేట్ చేసి ఉంటే సెక్యూరిటీ కారణాల దృష్ట్యా మీ బ్యాంక్ మీ యూపీఐ లిమిట్ తాత్కాలికంగా తగ్గించవచ్చు.

Read Also : Apple iPhone 16 Plus : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ఇంత తక్కువా? ఎంత తగ్గిందంటే?

కేవైసీ పూర్తి చేయకపోతే కూడా మీ యూపీఐ లిమిట్ తగ్గించవచ్చు. లిమిట్ యాప్‌కు కాకుండా మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండదని గుర్తుంచుకోండి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలలో సింగిల్ అకౌంట్ వాడటం వల్ల లిమిట్ పెరగదు.

యూపీఐ పేమెంట్ ఎలా పెంచాలి? :

  • ముందుగా మీ బ్యాంకును సంప్రదించండి
  • ప్రస్తుత యూపీఐ లిమిట్ గురించి సమాచారం పొందండి.
  • కేవైసీ అసంపూర్తిగా ఉంటే వెంటనే పూర్తి చేయండి.
  • మీ పేమెంట్ హై లిమిట్ కేటగిరీలో వస్తుందో లేదో చూడండి.
  • బ్యాంక్ లిమిట్ పెంచకపోతే ఇతర ఆప్షన్లు ఉన్నాయి.

మీ పేమెంట్ ఒకేసారి కాకుండా రెండు రోజుల వ్యవధిలో సెట్ చేసుకోండి. మరో బ్యాంక్ అకౌంట్ లేదా పెద్ద లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, RTGS వంటి ఆప్షన్లను ఎంచుకోండి. యూపీఐ చాలా ఈజీగా ఉంటుంది. కానీ, ప్రతి పెద్ద లావాదేవీకి యూపీఐ ఆప్షన్ కాదు. ఎంత పడితే అంత యూపీఐ పేమెంట్ చేస్తామంటే కుదరదు. అలా చేయాలంటే మీ బ్యాంకుతో సంప్రదించి మీ యూపీఐ లిమిట్ పెంచుకోవచ్చు.