×
Ad

Valentine Day 2026 : వాలెంటైన్స్ డే ఆఫర్.. రోజుకు జస్ట్ రూ.30 EMIతో.. పండుగ చేసుకోండి..

Samsung Galaxy A07 5G : వాలెంటైన్స్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో ఇలా కొనేసుకోండి.

  • Published On : February 14, 2026 / 02:21 PM IST
1/6
Samsung Galaxy A07 5G : వాలెంటైన్స్ డే సందర్భంగా శాంసంగ్ లవర్స్‌కు అద్భుతమైన ఆఫర్. శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 50MP డ్యూయల్ కెమెరా, 5జీ కనెక్టివిటీ, భారీ 6000mAh బ్యాటరీతో లభిస్తోంది.
2/6
శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధర రేంజ్‌లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి బెస్ట్ ఫోన్. అలాగే, హై-క్వాలిటీతో ఫొటోగ్రఫీ కోసం 50MP డ్యూయల్ బ్యాక్ కెమెరా కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్‌ డిస్కౌంట్ ధరలో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
3/6
శాంసంగ్ గెలాక్సీ A07 5Gపై అద్భుతమైన డిస్కౌంట్ : శాంసంగ్ గెలాక్సీ A07 5జీ మోడల్ 4GB ర్యామ్, 128GB స్టోరేజీ అసలు ధర రూ. 15,999 ఉండగా, లైట్ వయొలెట్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్‌లో నెలకు రూ. 900 వరకు (రోజుకు రూ. 30) ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ శాంసంగ్ ఫోన్‌ కొనేందుకు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ బడ్జెట్ ధరలోనే ఇంటికి తెచ్చుకోవచ్చు.
4/6
శాంసంగ్ గెలాక్సీ A07 5G ఫీచర్లు : ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.72-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్‌‌తో పాటు ఈ ఫోన్ పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 (4nm) సీపీయూతో మల్టీ టాస్కింగ్‌కు అద్భుతంగా ఉంటుంది.
5/6
మెమరీ, స్టోరేజీ ఆప్షన్లలో 128GB వరకు స్టోరేజీ అందిస్తుంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని మరింత పెంచుకోవచ్చు. ర్యామ్ విషయానికి వస్తే 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ కూడా అందిస్తుంది.
6/6
కెమెరా సెటప్ 50MP ప్రైమరీ సెన్సార్, సెకండరీ కెమెరాతో హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలను రికార్డు చేయొచ్చు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అలాగే, ఈ శాంసంగ్ ఫోన్‌లో 5G, Wi-Fi, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP64 రేటింగ్‌ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫైనల్‌గా ఈ శాంసంగ్ ఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.