×
Ad

Valentines Day 2026 : వాలెంటైన్స్ డే వీక్.. రూ. 5వేల లోపు ధరలో బెస్ట్ టెక్ గిఫ్ట్స్ ఇవే.. మీ పార్టనర్‌ను ఈ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేయొచ్చు..!

Valentine’s Day 2026 : వాలెంటైన్స్ డే కోసం మీ ప్రియమైనవారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు? రూ. 5వేల లోపు ధరలో అద్భుతమైన బెస్ట్ టెక్ గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి..

Valentines Day 2026

  • వాలెంటైన్స్ డే 2026 వీక్ మొదలైంది
  • రూ. 5వేల లోపు టెక్ గిఫ్ట్ ఐడియాలివే
  • మీ బడ్జెట్‌ ధరలో మంచి గిఫ్ట్ ఎంచుకోవచ్చు

Valentine’s Day 2026 : వాలెంటైన్స్ డే వీక్ మొదలైంది.. ఈ రొమాంటిక్ డేస్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తుంటారు. అనేక మంది ఫ్లవర్స్ లేదా చాక్లెట్లను గిఫ్ట్ ఇస్తారు. కానీ, మీ పార్టనర్ కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.

మీ భార్యకు టెక్ లేదా స్మార్ట్ హోమ్ గాడ్జెట్‌లంటే ఇష్టమైతే మార్కెట్లో అద్భుతమైన గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌ ధరలో మంచి గిఫ్ట్ కోసం కొనాలని అనుకుంటే ఈ డీల్స్ మీకోసమే.. ఈ వాలెంటైన్స్ సందర్భంగా రోజుకు రూ. 5వేల లోపు అద్భుతమైన గిఫ్ట్స్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.

2026 వాలెంటైన్స్ డే : రూ. 5వేల లోపు టెక్ గిఫ్ట్ ఐడియాలివే
స్మార్ట్ వాచ్ :
స్మార్ట్ వాచ్ లేదా ఫిట్‌నెస్ ట్రాకర్ అద్భుతమైన గిఫ్ట్. డెయిలీ యాక్టివిటీని ట్రాక్ చేయొచ్చు. ఫిట్‌నెస్ గోల్స్, హెల్త్ మానిటరింగ్, ఫోన్‌ టచ్ చేయకుండా రోజంతా చేసిన యాక్టివిటీకి సంబంధించి నోటిఫికేషన్‌లను పొందవచ్చు. రూ. 5వేల లోపు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి.

  • CMF బై నథింగ్ వాచ్ ప్రో 2
  • శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3
  • బోట్ క్రోమ్ ఐరిస్
  • రియల్‌మే వాచ్ 5
  • రెడ్‌మి వాచ్ మూవ్
  • నాయిజ్ ఆర్జిన్
  • లావా ప్రోవాచ్ ఎక్స్

TWS ఇయర్‌బడ్స్ :
మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లతో పాటు ఇష్టమైన షోలను చూసేవారికి TWS ఇయర్ బడ్స్ అద్భతంగా ఉంటాయి. మీ ప్రియమైనవారికి ఈ బడ్స్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. కేవలం రూ.5వేల లోపు ధరలోనే ఎంచుకోవచ్చు.

  • వన్‌ప్లస్ బడ్స్ 3 CMF
  • బై నథింగ్ బడ్స్ ప్రో 2
  • రియల్‌మి బడ్స్ ఎయిర్ 5 ప్రో
  • బోట్ నిర్వాణ అయాన్ ANC ప్రో
  • మోటో బడ్స్+
  • ఒప్పో బడ్స్ 3 ప్రో+
  • నాయిస్ ఎయిర్‌బడ్స్ ప్రో 6

బ్లూటూత్ స్పీకర్‌లు :
బ్లూటూత్ స్పీకర్లు కూడా గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఇంట్లో మ్యూజిక్ వినవచ్చు లేదా ఎక్కడికి వెళ్లినా స్పీకర్‌ను తీసుకెళ్లవచ్చు. రూ. 5వేల లోపు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని బెస్ట్ మీకోసం..

Read Also : Google Pixel 10 : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ధర ఎంతంటే?

  • సోనీ SRS-XB100 పోర్టబుల్ స్పీకర్
  • ఫిలిప్స్ TAS2400GR 32W బ్లూటూత్ స్పీకర్
  • పోర్ట్రోనిక్స్ Fynix 30W బ్లూటూత్ స్పీకర్
  • LG XG2T బ్లూటూత్ స్పీకర్
  • బోట్ స్టోన్ ఆర్క్ ప్రో ప్లస్

ఎయిర్ ప్యూరిఫైయర్ :
కాలుష్య స్థాయిలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్ తప్పనిసరిగా మారింది. వాలెంటైన్స్ డే రోజున మీ ప్రియమైనవారికి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇక్కడ కొన్ని బడ్జెట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

అటోవియో వేరబుల్, పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్

  • హనీవెల్ ఎయిర్ టచ్ V1
  • రిఫెయిర్ కాలిగో 500
  • క్వింక్ ఎయిర్ ప్యూరిఫైయర్ H13

పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైజ్ :
పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైజ్ కూడా వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఈ డివైజ్ ద్వారా పీరియడ్స్ సమయంలో రిలీఫ్ పొందవచ్చు.

  • WELME పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైస్
  • బ్రోంటిక్స్ పీరియడ్ క్రాంప్ రిలీఫ్ మసాజర్
  • మాత్రి ప్రో పీరియడ్ పెయిన్ రిలీఫ్ డివైస్

ఇతర గాడ్జెట్లు, టెక్ అప్లియన్సెస్ :
గాడ్జెట్లతో పాటు టెక్ అప్లియన్సెస్, స్మార్ట్ గాడ్జెట్‌లను గిఫ్ట్ ఇవ్వొచ్చు. స్మార్ట్ రింగ్‌లు, పవర్ బ్యాంక్‌లు, వెబ్‌క్యామ్‌లు, గేమింగ్ మౌస్‌లు, ట్రాకర్లు, గ్రూమింగ్ డివైజ్ వంటి ప్రొడక్టులను ఎంచుకోవచ్చు. రూ. 5వేల లోపు కొన్ని ప్రొడక్టులు ఉన్నాయి.

  • హెచ్‌పీ 320/53X26AA 5HD వెబ్‌క్యామ్
  • గోబౌల్ట్ 20,000mAh పవర్ బ్యాంక్
  • బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్
  • జియోట్యాగ్ గో
  • మోటో ట్యాగ్
  • ఫిలిప్స్ MG3724 ట్రిమ్మర్
  • VEGA సెలూన్ స్మూత్ స్ట్రెయిటెనర్