Apple iPhone 16 : విజయ్ సేల్స్ ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Apple iPhone 16 : ఐఫోన్ 16 తగ్గింపు ధరకే లభిస్తోంది.. విజయ్ సేల్స్‌లో రూ. 12వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16
Apple iPhone 16 : ఆపిల్ కొత్త ఐఫోన్ కావాలా? విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 కొనుగోలుపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌కు ముందే ఐఫోన్ 16 ధర (Apple iPhone 16) భారీగా తగ్గింది. ఈ ఐఫోన్ తక్కువకు ధరకే కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతానికి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ ఆఫర్ అందుబాటులో లేదు. విజయ్ సేల్ సమయంలో ఐఫోన్ 16 చౌకైన ధరకే పొందవచ్చు. గత ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ కాగా, యాక్షన్ బటన్, కెమెరా మాడ్యూల్, 512GB వరకు స్టోరేజీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
లాంచ్ సమయంలో ఈ ఐఫోన్ ధర రూ. 79,900 ఉండగా, విజయ్ సేల్స్‌లో రూ. 71,990కు తగ్గింది. అదనంగా, రూ. 4వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ కొనుగోలుపై రూ. 12వేల వరకు సేవ్ చేసుకోవచ్చు.
Read Also : Samsung Galaxy Z Flip 6 : బిగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
డిస్కౌంట్ తర్వాత ఈ ఐఫోన్ రూ.67,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 రూ.3179 ప్రారంభ ప్లాన్‌తో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. ఈ ఐఫోన్ 16 ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
ఐఫోన్ 16 ఫీచర్లు :
ఈ ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్ కలిగి ఉంది. కస్టమ్ A18 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. 6GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీ సపోర్ట్ చేస్తుంది. ఈ ఐఫోన్‌లో 2 కెమెరాలు ఉన్నాయి.
48MP మెయిన్ కెమెరాతో పాటు 12MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఫోన్ 12MP కెమెరా సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. కెమెరాలో యాక్షన్ బటన్ కూడా ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాన్ని కలిగి ఉంది.