Samsung Galaxy Z Flip 6 : బిగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy Z Flip 6 : అమెజాన్ ఆఫర్ అదిరింది.. ఈ శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 మడతబెట్టే ఫోన్ కొనుగోలుపై తగ్గింపు ఆఫర్ అందిస్తోంది.

Samsung Galaxy Z Flip 6
Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 తక్కువ ధరకే లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం (Samsung Galaxy Z Flip 6) అమెజాన్ ప్రస్తుతం స్టైలిష్ ఫోల్డబుల్‌పై రూ. 45వేల కన్నా ఎక్కువ తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
గతంలో కన్నా సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. సరైన డీల్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోన్ రూ.1,09,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.42,021 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో అసలు ధర నుంచి రూ.67,978కి తగ్గింది. మీరు HSBC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,250 తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడింగ్ చేయడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు.
Read Also : Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. అతి తక్కువ ధరకే 3 రీఛార్జ్ ప్లాన్‌లు.. రోజుకు 2GB డేటా..!
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6లో FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X మెయిన్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ డిస్‌ప్లే కలిగి ఉంది. గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ అందించారు.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ ఫోల్డబుల్ ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరా కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 64000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.