Vivo S60 Launch : వివో లవర్స్‌కు పండగే.. కొత్త వివో S60 వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లు!

Vivo S60 Launch : వివో S60 ఈ నెల చివర్లో చైనాలో లాంచ్ కానుంది. ఈ కొత్త ఫోన్‌లో గతంలో వివో S50 కన్నా భారీ బ్యాటరీ ఉంటుంది. ఇందులో సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటాయి.

Vivo S60 Launch Date

  • వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది
  • మే 29న వివో ఎస్60 ఫోన్ లాంచ్ కానుంది
  • డ్యూయల్ కెమెరా, 7,200mAh బ్లూ ఓషన్ బ్యాటరీ

Vivo S60 Launch : వివో లవర్స్ గెట్ రెడీ.. కిర్రాక్ ఫీచర్లతో కొత్త వివో ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెలాఖరులో చైనాలో వివో S60 లాంచ్ కానుంది. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ కూడా కంపెనీ వెల్లడించింది. ఇందులో రెక్టాంగులర్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. వివో S50 కన్నా వివో S60లో అతిపెద్ద బ్యాటరీ ఉంటుందని కంపెనీ అధికారి ఒకరు రివీల్ చేశారు.

వివో S50 గత ఏడాది డిసెంబర్‌లో 6,500mAh బ్యాటరీతో లాంచ్ అయింది. దీనికి అప్ గ్రేడ్ వెర్షన్ గా వివో ఎస్60 ఫోన్ (Vivo S60 Launch) రాబోతుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ స్కానర్‌ కూడా ఉండనున్నట్టు వివో ధృవీకరించింది.

వివో S60 మే 29న చైనాలో లాంచ్ :
వీబో పోస్టు ప్రకారం.. రాబోయే వివో S60 మే 29న చైనాలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు (భారత కాలమానం) సాయంత్రం 5:00 గంటలకు) లాంచ్ కానుందని ప్రకటించింది. లాంచ్ తేదీతో పాటు, ఈ టెక్ సంస్థ రాబోయే ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ డిజైన్‌ కూడా వెల్లడించింది.

ఈ హ్యాండ్‌సెట్‌లో రెక్టాంగులర్ రియర్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సిస్టమ్ సింగిల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అంతేకాదు.. వివో S60 ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. బాటమ్ సెంటర్ వద్ద కంపెనీ బ్రాండింగ్ లోగో ఉంచింది.

Read Also : Top 5 Upcoming Cars : SUV మార్కెట్‌కు కొత్త కింగ్స్.. మారుతి నుంచి హ్యుందాయ్ వరకు రాబోయే టాప్ 5 మాస్ కార్లు!

వివో S60 ఫోన్ వైట్ కలర్ ఆప్షన్లలో రావొచ్చు. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. ‘యూనిబాడీ కోల్డ్-కార్వ్డ్ గ్లాస్’ డిజైన్‌తో వస్తుంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ ఫోన్ రైట్ సైడ్ కనిపిస్తాయి.

వివో కంపెనీ ప్రకారం.. :
వివో S60లో 7,200mAh బ్లూ ఓషన్ బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ సమయంలో థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వివో ‘మైక్రో ఎలక్ట్రిక్ విజార్డ్ 2.0’కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుంది.

ఇందులో డ్యూయల్-స్పీకర్ సెటప్, సింగిల్ ఐఆర్ బ్లాస్టర్, మెరుగైన హాప్టిక్స్ కోసం ఎక్స్-లీనియర్ వైబ్రేషన్ మోటార్ ఉంటాయని కూడా ధృవీకరించింది.

వివో S60 ఫోన్ USB టైప్-C పోర్ట్ ద్వారా 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సేఫ్టీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. కంపెనీ ప్రకారం.. వివో S60 3D ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.