Vivo S60 Launch : వావ్.. వివో S60 సిరీస్ రచ్చ రేపుతోంది.. బ్యాటరీ బ్యాకప్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Vivo S60 Launch : వివో నుంచి రెండు కొత్త 5జీ ఫోన్లు వచ్చేశాయి. 7,200mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో వివో ఎస్60 సిరీస్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, స్పెఫిషికేషన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

Vivo S60 Series ( Image Credit : AI )

  • వివో S60 ఫోన్ 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌
  • మెయిన్ కెమెరా 50MP, ఎఫ్/1.75 అపర్చర్‌
  • వివో S60 ఫోన్‌లో భారీ 7,200mAh బ్యాటరీ ఆప్షన్

Vivo S60 Launch : వివో లవర్స్ కోసం అద్భుతమైన సిరీస్ ఫోన్ వచ్చేసింది. చైనా దిగ్గజ కంపెనీ వివో S60 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో వివో S60, వివో S60 వైటాలిటీ ఎడిషన్ అనే 2 ఫోన్లు ఉన్నాయి. భారీ 7200mAh బ్యాటరీ ఉంది.

90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 16GB ర్యామ్ కూడా (Vivo S60 Launch) అమర్చారు. డెడికేటెడ్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ కూడా ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వివో S60, వివో S60 వైటాలిటీ ఎడిషన్ ధర :
వివో S60 సిరీస్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,599 యువాన్లు (సుమారుగా రూ. 50వేలు) ఉంటుంది. 12GB + 512GB వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారుగా రూ. 56వేలు) ఉంటుంది. టాప్-ఆఫ్-ది-లైన్ 16GB + 512GB వేరియంట్ ధర 4,399 యువాన్లు (సుమారుగా రూ. 62వేలు ) ఉంటుంది.

వివో S60 వైటాలిటీ ఎడిషన్ 8జీబీ+ 256జీబీ కాన్ఫిగరేషన్‌తో బేస్ వేరియంట్ ధర CNY 2,899 (సుమారుగా రూ. 41,000). 12GB + 256GB, 12GB + 512GB వేరియంట్లు వరుసగా CNY3,199 (సుమారుగా రూ. 45,000), CNY 3,499 (సుమారుగా రూ. 49,000) ధరలకు అందుబాటులో ఉన్నాయి. జూన్ 3 నుంచి అమ్మకానికి వస్తాయి. కంపెనీ ఎర్లీ సమ్మర్ గ్రీన్, మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్, సీ ఆఫ్ స్టార్స్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

వివో S60 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో S60లో 1.5K రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ డిస్‌ప్లే ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 459పీపీఐ పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. ఈ ఫోన్ 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS6పై రన్ అవుతుంది. 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్‌కు సపోర్ట్ చేస్తుంది. 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ అందిస్తుంది. కంపెనీ IP68 + IP69 రేటింగ్‌ కూడా అందించింది.

Read Also : Gold Demand Drop : గోల్డ్ ఢమాల్..! 70 శాతం తగ్గిన డిమాండ్.. బంగారం కొనాలా? ఆగాలా? అసలు కారణాలివే..!

వివో S60 ఫోన్ 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ అందిస్తుంది. వివో S60లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP, ఎఫ్/1.75 అపర్చర్, OIS సపోర్ట్ ఉన్నాయి.

8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. మూడో సెన్సార్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అందిస్తుంది. 100x వరకు డిజిటల్ జూమ్‌ అందిస్తుంది. సెల్ఫీల కోసం కంపెనీ 50MP ఫ్రంట్ కెమెరా కూడా అమర్చారు.

వివో S60లో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో భారీ 7,200mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ కొలతలు 157.52×74.33×7.92mm, బరువు 207 గ్రాములు ఉంటుంది.

వివో S60 వైటాలిటీ ఎడిషన్ ఫీచర్లు :
వివో S60 వైటాలిటీ ఎడిషన్‌లో వివో S60 మాదిరి ఫీచర్లే ఉన్నాయి. అయితే, కెమెరా, ప్రాసెసర్‌లో కొద్దిగి భిన్నంగా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ లేదు. ప్రాసెసింగ్ కోసం 4nm ప్రాసెసింగ్ టెక్నాలజీపై మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ఫుల్ పవర్ చిప్‌తో అందిస్తుంది. ఈ ఫోన్‌లో 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫోన్ బరువు 199 గ్రాములు ఉంటుంది.