Vivo T5 Launch : కొత్త వివో ఫోన్ కేక.. 7,200mAh బ్యాటరీ, 50MP కెమెరా అదుర్స్.. ధర ఎంతంటే?

Vivo T5 Launch : కొత్త వివో టీ5 ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మిడ్ రేంజ్ టీ5 లైనప్‌లో లాంచ్ అయింది. ఈ 4జీ ఫోన్ ప్రస్తుతం రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Vivo T5 Launch

  • మిడ్ రేంజ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన వివో టీ5 4జీ ఫోన్
  • 7,200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో లాంచ్
  • రెండు కలర్ ఆప్షన్లు, సింగిల్ RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌

Vivo T5 Launch : వివో నుంచి సరికొత్త 4జీ ఫోన్ వచ్చేసింది. కొత్త వివో T5 ఫోన్ ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్, వివో T5 ప్రో 5జీ, వివో T5x 5జీ ఫోన్లలో కంపెనీ మిడ్-రేంజ్ టీ5 లైనప్‌లో మూడో మోడల్. ఈ 4జీ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రెండు కలర్ ఆప్షన్లలో సింగిల్ RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తోంది.

ఈ కొత్త వివో ఫోన్ క్వాల్‌కామ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,200mAh బ్యాటరీ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP మెయిన్ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 8GB LPDDR4x ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. వివో టీ5 ఫోన్ లాంచ్, ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో టీ5 ధర, లభ్యత :
8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్ వివో టీ5 ధర 5,799 MXN (సుమారు రూ. 32,000)కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం వివో మెక్సికో ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. వివో T5 ఫోన్ బ్లాక్, గోల్డ్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

వివో టి5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
కొత్త వివో టి5 ఫోన్ అనేది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6పై రన్ అయ్యే డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.75-అంగుళాల HD+ (720×1,570 పిక్సెల్స్) ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 83శాతం NTSC కవరేజ్ 1,250 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. వివో టి5 ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుందని కంపెనీ పేర్కొంది.

Read Also : BoB UPI Payments : ఈ బ్యాంకు కస్టమర్లకు ఇక యూపీఐ పిన్ అక్కర్లేదు.. ఫింగర్ ఫ్రింట్, ఫేస్‌తోనే పేమెంట్లు చేయొచ్చు!

కొత్త వివో టి5 క్వాల్‌కామ్ 6nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌లో 1.9GHz క్లాక్ స్పీడ్‌తో 4 ఎఫిషియెన్సీ కోర్లు 2.9GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో 4 పెర్ఫార్మెన్స్ కోర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB LPDDR4x ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

కెమెరాల విషయానికొస్తే.. :
వివో టి5లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. అదనంగా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ రియర్ కెమెరా ఉంది. చివరగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వివో టీ5లో 32MP (ఎఫ్/2.45) ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. :
ఈ వివో ఫోన్ 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, USB టైప్-సీ పోర్ట్, జీపీఎస్, BeiDou, GLONASS, Galileo, QZSS వంటి సెన్సార్లు ఉన్నాయి.

సేఫ్టీ కోసం యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, గైరోస్కోప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఫోన్ కొలతలు 166.64×78.43×8.39mm,బరువు సుమారుగా 219 గ్రాములు. ఈ ఫోన్‌లో 7,200mAh బ్యాటరీ ఉంది. 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.