Vivo T5 Pro : వివో నుంచి కిర్రాక్ ఫోన్ వస్తోంది.. ఈసారి ప్రో మోడల్ రేంజ్ వేరబ్బా.. ఫీచర్లు మాత్రం కేక, ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo T5 Pro : వివో T5 ప్రో రాబోతుంది. 2026 ఏప్రిల్ మధ్యలో లాంచ్ అయ్యే ఛాన్స్. లీకుల ప్రకారం.. ప్రారంభ ధర సుమారు రూ. 35,000 మధ్య ఉండవచ్చని అంచనా.
- Sreehari A
- Published On : March 28, 2026 / 03:06 PM IST
Vivo T5 Pro
- వివో నుంచి సరికొత్త టీ5 ప్రో వచ్చేస్తోంది
- వివో టీ5 ప్రో ధర, ఫీచర్లపై భారీ అంచనాలు
- భారీ బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Vivo T5 Pro : కొత్త వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో వివో టీ సిరీస్ అతి త్వరలో లాంచ్ కాబోతుంది. స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు ప్రకారం.. వివో T5 ప్రో లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.
ఇప్పటికే ఈ టీ5 ప్రోకు సంబంధించి చాలా ఫీచర్లు రివీల్ అయ్యాయి. ఈ డివైజ్‌లో భారీ బ్యాటరీతో పాటు హై రిఫ్రెష్ రేట్ అందించనుంది. గత మోడల్‌తో పోలిస్తే ధర కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
భారత్‌లో వివో టి5 ప్రో లాంచ్ టైమ్, ధర :
వివో టీ5 ప్రో ఫోన్ 2026 ఏప్రిల్ మధ్య నాటికి భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. ధర పరంగా పరిశీలిస్తే.. ఈ వివో ఫోన్ మార్కెట్లో రూ. 35,000 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. సేఫ్ మిడ్-రేంజ్ కేటగిరీలో వస్తుంది.
ప్రస్తుతానికి, సేల్ ప్లాట్‌ఫామ్, ఇతర వివరాలు వెల్లడి కాలేదు. లాంచ్ సమయం దగ్గర పడుతున్న పూర్తి వివరాలు రివీల్ కానున్నాయి. లీకుల ప్రకారం.. ఈ వివో ఫోన్ కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ అనే 2 కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
వివో టి5 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో టీ5 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో రావచ్చు. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. లాంచ్ సమయంలో ఈ డివైజ్ మరిన్ని స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఒరిజిన్ఓఎస్ 6 ఉంటుంది.
వివో టీ5 ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ స్నాపర్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ సెన్సార్ సోనీ IMX882 లెన్స్ కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 9020mAh బ్యాటరీతో పాటు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
