Vivo T5 Pro : గేమర్లకు పండగే.. 9,020mAh భారీ బ్యాటరీతో వివో కొత్త 5G ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్..
Vivo T5 Pro : వివో కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 15న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published On : April 9, 2026 / 02:24 PM IST
Vivo T5 Pro : వివో లవర్స్ కోసం అద్భుతమైన 5జీ ఫోన్ రాబోతుంది. అతి త్వరలోనే భారత మార్కెట్లోకి వివో టీ5 ప్రో 5జీ లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఎక్స్ (X)లో లాంచ్ వివరాలను ప్రకటించింది. 1.5K రిజల్యూషన్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
భారత మార్కెట్లో వివో టీ5 ప్రో 5జీ లాంచ్ : వివో టీ5 ప్రో 5టీ ఫోన్ ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మేరకు వివో ధృవీకరించింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను వైట్ కలర్ ఆప్షన్లలో వర్టికల్ బ్యాక్ కెమెరాతో వచ్చింది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ లెన్స్, డిస్‌ప్లే షేప్ కటౌట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో రానుంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో 9,020mAh బ్యాటరీ ఉంటుంది. వివో T4 ప్రోలో 6,500mAh బ్యాటరీతో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ స్క్రీన్ ఉంటుంది. ప్రీ ఇన్‌స్టాల్ ఒరిజిన్ఓఎస్ 6 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
వివో టీ5 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా) : ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఈ ఫోన్ లాంచ్ కోసం స్పెషల్ ల్యాండింగ్ పేజీని పబ్లీష్ చేసింది.
డిస్‌ప్లేకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏప్రిల్ 13న ప్రకటించనున్నట్టు లిస్టింగ్‌లో పేర్కొంది. అంతేకాదు.. బ్యాటరీ, పర్ఫార్మెన్స్ వివరాలు వరుసగా ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 10న వెల్లడి కానున్నాయి.
మీడియా లీకుల ప్రకారం.. భారత మార్కెట్లో వివో టి5 ప్రో 5జీ రూ. 30వేల నుంచి రూ. 35వేల మధ్య ధరతో లాంచ్ కానుంది.
144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల డిస్‌ప్లే వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు. 2025లో వివో టీ4 ప్రో ఫోన్ రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.
