Vivo T5x 5G Deal : ఇది కదా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 46వేల వివో 5G ఫోన్‌ జస్ట్ రూ. 23వేలకే..!

Vivo T5x 5G Deal : వివో 5జీ ఫోన్ ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సందర్భంగా భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ అదిరే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Vivo T5x 5G Deal

  • వివో టి5ఎక్స్ 5జి 6.76-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
  • ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా సెటప్
  • ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో రూ. 4,475 భారీ తగ్గింపు

Vivo T5x 5G Deal : వివో లవర్స్ డోంట్ మిస్.. వివో టీ5ఎక్స్ 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సమయంలో ఆపిల్, వివో, రియల్‌మీ, పోకో వంటి బ్రాండ్‌లకు చెందిన మొబైల్ పలు మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లపై నేరుగా తగ్గింపులతో పాటు యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పేమెంట్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. వివో ఫోన్‌పై స్పెషల్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వివో టీ5ఎక్స్ 5జీ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం.. రూ. 45,999 ధర ఇప్పుడు 40శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 18,250 డిస్కౌంట్‌ను అందిస్తోంది. తద్వారా ధర రూ. 27,749కి తగ్గుతుంది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంకులతో అదిరిపోయే డీల్స్‌, స్పెషల్ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు.

Read Also : Best Smartphones 2026 : 5000mAh బ్యాటరీ AI కెమెరా అదుర్స్.. రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

బ్యాంక్ ఆఫర్ :
మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో వివో T5x 5Gని తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. తద్వారా రూ.4,475 భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ వివో ఫోన్ ధర రూ. 23,274కి తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు రూ. 46వేల విలువైన ఫోన్‌ను కేవలం రూ. 23వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు. మరింత సమాచారం కోసం, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో టీ5ఎక్స్ 5జీ ఫోన్ 6.76-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 7200mAh బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది.

50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్ అందిస్తుంది.