×
Ad

Vivo V60e 5G : వివోనా మజాకా.. 200MP కెమెరాతో వివో V60e 5G భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo V60e 5G:కొత్త వివో 5జీ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. 200MP కెమెరాతో వివో V60e 5జీ ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

1/5
Vivo V60e 5G:కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? 200MP కెమెరా కలిగిన వివో ఫోన్ మీకోసమే.. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో వివో V60e 5G ఫోన్ భారీ తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 30వేల కన్నా తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ డీల్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. పవర్‌ఫుల్ బ్యాటరీ, వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో ఈ ఫోన్‌ కొనుగోలు చేయొచ్చు.
2/5
వివో V60eపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు : ధర విషయానికొస్తే.. ప్రస్తుతం 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మీరు 14శాతం తగ్గింపుతో ధర రూ. 34,999 నుంచి అమెజాన్‌లో రూ. 29,999కు కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు బ్యాంక్ ఆఫర్‌లతో ధరను మరింత తగ్గించవచ్చు.
3/5
బ్యాంక్ ఆఫర్ల ద్వారా Axis, HDFC, Kotak క్రెడిట్ కార్డులపై రూ. 1500 తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో లేదు. రూ. 1454 నుంచి ఈఎంఐ ఆప్షన్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి.
4/5
వివో V60e 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ వివో ఫోన్ 6.77-అంగుళాల ఫుల్ HD+ క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2392×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 1900 నిట్స్. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. 12GB LPDDR4x ర్యామ్ 256GB స్టోరేజ్‌తో వస్తుంది. డైమెన్సిటీ 7360 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అదనంగా, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రన్ అయ్యే ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది.
5/5
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం 200ఎంపీ మెయిన్ OIS కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. IP68 + IP69 రేటింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. నోబుల్ గోల్డ్, ఎలైట్ పర్పుల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.