×
Ad

Vivo V70 FE Launch : వివో లవర్స్‌కు పండగే.. వివో V70 FE ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు కేక, ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V70 FE Launch : వివో వి70 ఎఫ్ఈ ఫోన్ వచ్చేస్తోంది. అతి త్వరలో భారత మార్కెట్లో ఇంకా లాంచ్ కానుంది. ఈ వివో ఫోన్ ధర, ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Published On : February 24, 2026 / 05:34 PM IST

Vivo V70 FE Launch

Vivo V70 FE Launch : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ రాబోతుంది. ఇటీవలే వివో V70 ఎలైట్, వివో V70 భారత మార్కెట్లో లాంచ్ కాగా చైనీస్ కంపెనీ కొత్త వివో V70 FEతో సిరీస్‌ను విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్ ఎడిషన్ వేరియంట్ లైనప్‌లో ఈ వివో ఫోన్ వచ్చే నెలలో దేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో పాటు డ్యూయల్ కెమెరా సెటప్‌ అందిస్తుందని లీక్‌లు సూచించాయి. కంపెనీ ప్రస్తుతానికి వివరాలను ధృవీకరించలేదు. కీలక స్పెసిఫికేషన్లు, ధర రేంజ్, లాంచ్ టైమ్‌లైన్‌ సంబంధించి లీక్‌లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

వివో V70 ఎఫ్ఈ భారత్ లాంచ్ టైమ్‌లైన్ :
రిపోర్టులను విశ్లేషిస్తే.. వివో V70 ఎఫ్ఈ వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. అయితే, లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. లీక్‌లను పరిశీలిస్తే.. ఈ వివో ఫోన్ ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కావచ్చని కూడా సూచిస్తున్నాయి. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also : Google Pixel 10 : ఇది కదా డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10పై కిర్రాక్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా రూ. 13వేలు తగ్గింపు!

వివో V70 FE స్పెసిఫికేషన్లు :
వివో V70 FE స్మార్ట్ విజువల్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని పుకారు ఉంది. హుడ్ కింద, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. భారీ 7,000mAh బ్యాటరీ కావచ్చు. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

వివో ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో వస్తుందని అంచనా. 6 ఏళ్ల వరకు అప్‌డేట్స్‌తో ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS 6తో రన్ అవుతుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు OISతో 200MP ప్రైమరీ సెన్సార్‌ అందించవచ్చు. అయితే, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

భారత్‌లో వివో V70 FE ధర (అంచనా) :
భారత మార్కెట్లో వివో V70 FE ఫోన్ ధర దాదాపు రూ.30వేలు ఉంటుందని అంచనా. ఈ వివో V70 FE ఫోన్ మోడల్ వివో V70 ధర రూ.45,999 కన్నా తక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, భారత మార్కెట్లో వివో V70 FE లాంచ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ ఫోన్ పూర్తి వివరాల కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.