Vivo V70 FE : కిర్రాక్ ఫీచర్లతో వివో V70 FE ఫోన్ వచ్చేస్తోంది.. 7000mAh భారీ బ్యాటరీ హైలెట్, ధర మీ బడ్జెట్‌లోనే..?
Vivo V70 FE : వివో V70 ఎఫ్ఈ వచ్చేస్తోంది. ఏప్రిల్‌లో 2వ తేదీన ఈ వివో ఫోన్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే ఫోన్ ఫీచర్, బ్యాటరీ సహా ధర వివరాలు లీక్ అయ్యాయి.
- Sreehari A
- Published On : March 30, 2026 / 02:05 PM IST
Vivo V70 FE : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే ఏప్రిల్ నెలలో వివో V70 ఎఫ్ఈ రాబోతుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. భారత మార్కెట్లో ఏప్రిల్ 2, 2026న మధ్యాహ్నం 12:00 గంటలకు వివో వి70 లాంచ్ కానుంది.
కంపెనీ ఇంకా ఈ ఫోన్ పూర్తి వివరాలను వెల్లడించలేదు. కానీ, లీకుల ద్వారా వివో వి70 ఎఫ్ఈ ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.
వివో V70 FE కెమెరా, స్పెసిఫికేషన్లు : వివో V70 ఎఫ్ఈ 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది.
అంతేకాకుండా, ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఒరిజిన్OS స్కిన్‌తో వస్తుందని వివో ఇప్పటికే ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7000mAh బ్యాటరీ కూడా ఉంటుంది.
వివో V70 ఎఫ్ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని అంచనా. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ సెన్సార్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ ఉంటాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు. ఇతర ఫీచర్లలో అండర్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లు ఉండవచ్చు.
వివో V70 FE ధర (అంచనా) : భారత మార్కెట్లో వివో వి70 ఎఫ్ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 నుంచి రూ.36,999 మధ్య ఉంటుందని అంచనా. ఈ వివో ఫోన్ లైట్ పర్పల్, సిల్వర్, బ్లూ అనే 3 కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుందని భావిస్తున్నారు.
