Vivo V80 India Launch : 7,200mAh బ్యాటరీతో కొత్త వివో V80 వచ్చేస్తోందోచ్.. అక్టోబర్ 6నే లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Vivo V80 India Launch : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లోని జైస్ బ్రాండెడ్ రియర్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP సోనీ లైటియా 700V ప్రైమరీ కెమెరా ఉంటుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.

  • Published on- September 22, 2026 / 09:16 PM IST

Vivo V80 India Launch

  • వివో V80 అక్టోబర్ 6న భారత మార్కెట్లో లాంచ్
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉండొచ్చు
  • వివో V80 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది

Vivo V80 India Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి వచ్చే నెలలో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. వివో V80లో 50MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,200mAh బ్యాటరీని అమర్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయిన వివో V70 స్థానంలో రానుంది. వివో V80లో 144Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 7పై రన్ అవుతుంది. వివో V80లో స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 ప్రాసెసర్‌ కూడా ఉండొచ్చు.

అక్టోబర్ 6నే లాంచ్ :
రాబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించింది. ఈ మైక్రోసైట్ వివో V80 కీలక స్పెసిఫికేషన్లను వివరిస్తుంది. వివో V80 అక్టోబర్ 6న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సన్‌రైజ్ ఆంథెమ్, హొరైజన్ బ్లూ, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

వివో వి80లో 144Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్‌తో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని జైస్-బ్రాండెడ్ వెనుక కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP సోనీ LYTIA 700V ప్రైమరీ కెమెరా, 50MP నైట్ టెలిఫోటో కెమెరా, వైడ్-యాంగిల్ కెమెరా ఉంటాయి.

Read Also : Apple iPhone 17 : కొంటే ఐఫోన్ ఇప్పుడే కొనాలి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!

కెమెరా, వీడియో రికార్డింగ్ :
దీనికి 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4K సినిమాటిక్ వీడియో రికార్డింగ్, 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో V80లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొన్ని ఇమేజింగ్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్OS 7పై రన్ అవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో పాటు 7,200mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ 39 గంటలకుపైగా వీడియో ప్లేబ్యాక్, 14 గంటల వరకు నావిగేషన్ అందిస్తుందని వివో తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్ వివరాలు రివీల్ అవ్వలేదు. ఇటీవలే వివో V80 బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్‌లో లిస్టు అయింది. ఈ లిస్టు ప్రకారం వివో V80లో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 1,070 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 3,552 పాయింట్లు సాధించింది.