×
Ad

Vivo X100 Pro : అద్భుతమైన ఆఫర్ భయ్యా.. వివో X100 ప్రో ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo X100 Pro : వివో X100 ప్రో ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో వివో X100 ప్రో ఫోన్ ధర తగ్గింది. ఈ వివో ఫోన్ కొనుగోలుపై రూ. 32వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/6
Vivo X100 Pro : వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వివో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. వివో X100 ప్రో ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో రూ.32వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.57,499 కన్నా తక్కువ ధరకే లభిస్తోంది.
2/6
గత ఏడాదిలో రూ.89,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్, కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు, భారీ బ్యాటరీతో వస్తుంది. మీరు ఫ్లాగ్‌షిప్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే వివో X100 ప్రో అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. మీరు ఈ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/6
అమెజాన్‌లో వివో X100 ప్రో ధర ఎంతంటే? : అమెజాన్‌లో వివో X100 ప్రో 5జీ ఫోన్ ఇప్పుడు రూ.58,999కు పొందవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,999 ఉండగా రూ.31వేలు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.1,500 తగ్గింపుతో కొనొచ్చు. దాంతో ధర రూ.57,499కి తగ్గుతుంది. నెలకు రూ.2,074 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
4/6
కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌తో రూ.35,950 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, మోడల్, యాక్టివిటీపై ఆధారపడి ఉంటుంది.
5/6
వివో X100 ప్రో స్పెసిఫికేషన్లు : వివో X100 ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. హార్డ్‌వేర్ కేటగిరీలో స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ అందిస్తుంది.
6/6
కెమెరా విషయానికి వస్తే.. వివో X100 ప్రోలో జీఈఐఎస్ఎస్ ద్వారా 50MP సోనీ IMX989 సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. వివో X100 ప్రో 100W ఫ్లాష్‌ఛార్జ్ టెక్నాలజీకి సపోర్టు ఇచ్చే 5,400mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS14పై కూడా రన్ అవుతుంది.