Vivo X200 Price : సూపర్ డిస్కౌంట్ బ్రో.. వివో X200పై దిమ్మతిరిగే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనాలా? వద్దా?

Vivo X200 Price : వివో ఎక్స్200 ఫోన్ ధర రూ. 7వేలకు పైగా తగ్గింపు పొందింది. ఈ పాత ఫోన్ ఇప్పుడు కొనడం బెటరా? పూర్తి వివరాలివే..

Vivo X200 Price

  • ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లతో వివో ఎక్స్200 మరింత తగ్గింపు
  • స్మూత్ డిస్‌ప్లే, ఫాస్ట్ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో లాంగ్ బ్యాటరీ లైఫ్‌
  • తక్కువ ధరలో మంచి కెమెరా ఫోన్ కోసం చూసేవారికి బెస్ట్ ఆప్షన్

Vivo X200 Price : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. వివో X200 ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 2024లో రూ. 65,999 ధరతో వచ్చిన ఈ వివో ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్, కెమెరా పరంగా తక్కువ ఖర్చులో ఈ ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

నేరుగా డిస్కౌంట్లతో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. ఇలాంటి ప్రమోషనల్ (Vivo X200 Price) డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీకు వివో ఫోన్ కొనాలని ఉంటే వెంటనే కొనేసుకోవడం బెటర్. ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200 డీల్ :
ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో వివో X200 ఫోన్ రూ. 61,999 ధరకు లభిస్తోంది. అసలు ధరపై రూ. 4వేలు నేరుగా తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 3,100 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

కార్డ్ డిస్కౌంట్లతో ఈ వివో ఫోన్ ధర రూ. 58,899కి తగ్గుతుంది. వన్ టైమ్ ఫుల్ పేమెంట్ చేయలేకుంటే ఫ్లిప్‌కార్ట్ 36 నెలలకు నెలకు కేవలం రూ. 2,180 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.

కొత్త ఫోన్ అప్‌గ్రేడ్ కోసం చూస్తుంటే మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి రూ. 43,650 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఫైనల్ వాల్యూ అనేది మీ పాత మోడల్, బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5Gపై రూ. 37,510 తగ్గింపు.. అమెజాన్‌లో జస్ట్..!

వివో X200 స్పెసిఫికేషన్లు :
వివో X200లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌ అమర్చారు. అలాగే, 16GB వరకు ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP69 రేటింగ్ కూడా ఉంది.

ఈ వివో ఫోన్‌లో 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది. HDR10+, 120Hz వరకు స్పీడ్ అందుకోగల అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అలాగే, ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,800mAh బ్యాటరీ కూడా ఉంది.

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో X200 ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అంతేకాదు.. ఫ్రంట్ సైడ్ కెమెరా 32MP రిజల్యూషన్‌ అందిస్తుంది.

వివో X200 కొనాలా? వద్దా? :
వివో X200 అద్భుతమైన ఆల్-రౌండ్ ఫోన్.. ఫొటోలు చాలా అద్భుతంగా వస్తాయి. ఈ ఫోన్ ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు గేమింగ్‌ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఈ వివో ఫోన్ కొనడమే బెటర్. మీకు సరసమైన ధరలో మంచి కెమెరా ఫోన్ కావాలంటే వివో X200 ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు.