Vivo Y300 launching tomorrow
Vivo Y300 Launch : వివో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివో వై300 ఫోన్ భారతీయ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. నవంబర్ 21 మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. వివో వై300 ప్లస్‌ను చివరి నెలలో లాంచ్ చేసిన తర్వాత సిరీస్ ప్రామాణిక వేరియంట్ ధర కొంచెం తక్కువగా ఉండనుంది.
ప్లస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.23,999 ఉండగా, వివో వై300 ధర సుమారు రూ. 20వేలు ఉండవచ్చు. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను కూడా కంపెనీ ధృవీకరించింది. వివో వై300 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరా లెన్స్‌కి దిగువన ఉండే రింగ్ లైట్‌ను కూడా కలిగి ఉంటుంది. లేకపోతే, బ్యాక్ ప్యానెల్ దిగువన బ్రాండ్ లోగోతో ఉంటుంది. వివో వై300 స్పెషిఫికేషన్ల వివరాలను వివరంగా తెలుసుకుందాం.
వివో వై300 స్పెషిఫికేషన్లు (అంచనా) :
వివో వై300 డిజైన్ లాంగ్వేజ్‌ని వెల్లడించింది. వివో వై300 మెటాలిక్ ఫ్రేమ్‌తో కూడిన బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్రైట్ పర్పుల్, సీ గ్రీన్ గ్రే అనే 3-కలర్ ఆప్షన్లలో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ వేరియంట్ల మార్కెటింగ్ పేర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బ్యాక్ ప్యానెల్ ఆసక్తికరమైన కెమెరా వివరాలను సూచిస్తుంది. వివో వై300 మెరుగైన లో లైటింగ్ ఫోటోగ్రఫీకి ఆరా లైట్లను కలిగి ఉంటుంది.
బ్యాక్ ప్యానెల్ డిజైన్ లాంగ్వేజ్ గత ఏడాది ప్రారంభించిన మునుపటి వివో వై200 నుంచి చాలా భిన్నంగా ఉంటుంది. వివో వై300 మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా వస్తుంది. ఇందులో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 మెయిన్ సెన్సార్, 8ఎంపీ సెకండరీ లెన్స్‌తో పాటు సెల్ఫీలకు 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14 వరకు అందించవచ్చు. ఐపీ64 వాటర్ రెసిస్టెన్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.0, స్టీరియో స్పీకర్లు, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది.
వివో వై300 ధర (లీక్) :
వివో వై300 5జీ ఫోన్ 8జీబీ 16జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని అంచనా. లేటెస్ట్ లీక్ ప్రకారం.. వెనిలా మోడల్ ధర రూ.21వేల నుంచి ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్ వేరియంట్ ధర సుమారు రూ. 24వేలు ఉండవచ్చు. అయితే ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.