Vivo Y6k Launch : రూ. 22 వేలకే Vivo కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీ..!

Vivo Y6k Launch : వివో Y6k కొత్త స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా, IP65 రేటింగ్, 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo Y6k Price

  • 13MP కెమెరా, 6500mAh బ్యాటరీతో కొత్త వివో Y6k ఫోన్
  • 120Hz డిస్‌ప్లే, IP65 రేటింగ్, 6500mAh బ్యాటరీ సెటప్
  • తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..

Vivo Y6k Launch : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? బ్యాటరీ బ్యాకప్, కెమెరా, డిస్‌ప్లే విషయంలో మంచి ఫీచర్లు కోరుకునేవారికి ఇదే బెస్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలో ఎక్కువ రోజులు పనిచేసే బ్యాటరీ, 5G కనెక్టివిటీ ఉంటే ఇంకా బాగుంటుంది.

ఇలాంటి కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని వివో కొత్త స్మార్ట్‌ఫోన్ Y6kను మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, IP65 రేటింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది.. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

Vivo Y6k ధర ఎంత?
వివో వై6k ప్రస్తుతం చైనా మార్కెట్లో లాంచ్ అయింది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లు ఉంటుంది. భారత కరెన్సీలో సుమారు రూ.22వేలుగా ఉంటుంది. బ్లూ, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది..

డిస్‌ప్లే, ప్రాసెసర్ :
ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల ఎల్ సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. దీంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం వంటి టాస్కులు చాలా స్మూత్‌గా ఉంటాయి.

Read Also : Top 5 Camera Smartphones : ఈ దీపావళికి అదిరిపోయే టాప్ 5 కెమెరా ఫోన్లు.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇందులో 6GB వరకు ర్యామ్, 128GB వరకు స్టోరేజ్ అందిస్తుంది..

6500mAh బ్యాటరీ.. 13MP కెమెరా :
ఈ ఫోన్‌లో మెయిన్ అట్రాక్షన్.. 6500mAh భారీ బ్యాటరీ. 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఐదేళ్ల వరకు పనిచేసేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP కెమెరా అమర్చారు..

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఉంది. ఇక 5జీ, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP65 రేటింగ్ కూడా అందించారు..

మొత్తానికి భారీ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి వివో Y6k అద్భుతమైన ఆప్షన్‌.. అయితే, భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుంది అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.