Vodafone Idea : Jio, Airtelకి పోటీగా Vi బిగ్ ఆఫర్.. 365 రోజుల ప్లాన్‌తో OTT భారీ బెనిఫిట్స్!

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ అదిరింది. జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌, అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్‌ ఏడాది పాటు ఎంజాయ్ చేయొచ్చు.

Vodafone Idea Plan

  • వోడాఫోన్ ఐడియా అద్భుతమైన 365 రోజుల ప్లాన్
  • ఏడాది పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం
  • ఒక ఏడాది అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్‌ పొందొచ్చు
  • రోజుకు 100 SMS, ప్రతిరోజూ 2GB డేటా వస్తుంది

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు అదిరిపోయే ప్లాన్.. ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం మరెన్నో అద్భుతమైన ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, లాంగ్ టైమ్ ప్లాన్‌లలో 365 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ కన్నా బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయి.

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లలో ఈ ఆకర్షణీయమైన డేటా ప్లాన్ ఆఫర్ చేస్తోంది. నెలనెలా రీఛార్జ్ కష్టాలు పడలేని యూజర్లకు ఈ వార్షిక రీఛార్జ్ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో హై డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉన్నాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Vi సూపర్ హీరో రూ. 3999 ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్‌ అందిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి రూ.3999 చెల్లించి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రత్యేక బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

డైలీ 2GB డేటా :
వినియోగదారులకు ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తుంది. డేటా కోటా లిమిట్ దాటాక ఇంటర్నెట్ స్పీడ్ 64Kbps వద్ద లిమిటెడ్‌గా ఉంటుంది.

Read Also : Tecno Pova 8 Launch : బ్యాటరీ కింగ్ వచ్చేస్తోంది.. 8,000mAhతో టెక్నో పోవా 8 ఎంట్రీకి రెడీ, కీలక ఫీచర్లు లీక్!

అన్‌లిమిటెడ్ కాల్స్ : 
ఈ ప్లాన్ యూజర్లకు 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇష్టమైనవారితో కావలసినంత సేపు మాట్లాడుకోవచ్చు. కంపెనీ రోజుకు 100 SMSలు అందిస్తుంది. పూర్తి ఏడాది మొత్తం ప్రతిరోజూ 100 SMS ఎవరికైనా పంపుకోవచ్చు.

ఫ్రీ జియోహాట్‌స్టార్ :
ఈ ప్లాన్‌తో ఏడాది పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. జియోహాట్‌స్టార్ మొబైల్‌తో స్పెషల్ టీవీ షోలు, సీరియల్స్ లైవ్ స్పోర్ట్స్‌ను యాక్సస్ చేయొచ్చు.

అమెజాన్ ప్రైమ్ లైట్ ఫ్రీ :
వినియోగదారులు ఏడాది వరకు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ పొందుతారు. ఈ సబ్‌స్క్రిప్షన్ 365 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. తద్వారా ప్రైమ్ వీడియో కంటెంట్‌ను ఫ్రీగా చూడవచ్చు. మీ టీవీలో లేదా మొబైల్ ఫోన్లలో చూడవచ్చు. HD కంటెంట్‌ను HD(720p)లో స్ట్రీమ్ అవుతుంది. కంపెనీ నుంచి ఫ్రీగా వన్ డే డెలివరీ బెనిఫిట్ కూడా పొందవచ్చు.

రాత్రి 12 గంటల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటా :
ఈ ప్లాన్‌ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఫ్రీగా అన్ లిమిటెడ్ డేటాను పొందవచ్చు. అదనంగా, సోమవారం నుంచి శుక్రవారం వరకు వాడని డేటా ఏదైనా శనివారానికి ఫార్వార్డ్ అవుతుంది. అంటే.. మిగిలిన డేటా వృధా కాదు అనమాట. అలాగే, ఈ ప్లాన్‌తో కంపెనీ నెలకు 2GB ఫ్రీ బ్యాకప్ డేటాను కూడా ఆఫర్ చేస్తోంది.