Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ. 12వేలు ఆదా.. ఇప్పుడు కొనాలా? వద్దా?

Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనేవారికి అద్భుతమైన ఆఫర్. ఈ కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 12వేలు వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ క్రేజీ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Apple iPhone 17 Pro ( Image Credit : AI )

  • ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై రూ. 9,750 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • ప్రస్తుత ధర రూ. 1,30,790, అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు
  • పాత ఐఫోన్‌లతో పోలిస్తే A19 ప్రో చిప్, ట్రిపుల్ 48MP కెమెరా, బ్యాటరీ లైఫ్‌

Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? కాస్మిక్ ఆరెంజ్ కలర్ ఐఫోన్ 17 ప్రో ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఇదే బెస్ట్ టైమ్. విజయ్ సేల్స్‌లో సరికొత్త ప్రో ఐఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.

ఈ డీల్‌ కోసం మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే బెటర్. ఇక ఈ ఐఫోన్ 17 ప్రో విషయానికి వస్తే.. ఆపిల్ అద్భుతమైన (Apple iPhone 17 Pro) బ్యాటరీ, డిస్‌ప్లే హార్డ్‌వేర్ మార్పులతో అందిస్తుంది. ట్రిపుల్ కెమెరా కొత్త స్క్వేర్ కెమెరా ఐలాండ్‌ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో ధర డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఐఫోన్ 17 ప్రో ధర :
మీరు ఐఫోన్ 17 ప్రోను రూ. 1,30,790కే పొందవచ్చు. అంటే రూ. 4వేలకుపైగా ధర తగ్గింపు పొందచ్చు. మీ వద్ద అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ ఉంటే రూ. 9,750 వరకు బ్యాంక్ ఆఫర్‌ పొందవచ్చు. దాంతో ఐఫోన్ ధర సుమారు రూ. 1,21,000కు తగ్గుతుంది. ఇదే అద్భుతమైన డీల్. ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ ఆదా చేయొచ్చు.

Read Also : Trump Mobile T1 phone : వారెవ్వా.. ట్రంప్ మొబైల్ T1 వచ్చేస్తోంది.. అసలేంటి ఈ ఫోన్? ఫీచర్లు నెక్స్ట్ లెవెల్, ధరలో బిగ్ ట్విస్ట్!

నెలకు రూ. 21,131 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ 6 నెలలు చెల్లిస్తే చాలు. రూ. 981 విలువైన 981 పాయింట్లు పొందవచ్చు. వచ్చే ఏడాది రీడీమ్ చేసుకోవచ్చు. మీ పాత డివైజ్‌ను ఎక్స్ఛేంజ్ చేసి ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు. అయితే, డివైజ్, వర్కింగ్ కండిషన్ బట్టి మీ ఫోన్ వాల్యూ ఉంటుంది.

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలా? వద్దా? :
మీ దగ్గర ఐఫోన్ 15 ప్రో లేదా పాత మోడల్ ఉంటే ఈజీగా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. A19 ప్రో చిప్, సింగిల్ మూడు 48MP కెమెరాలు, 2 నుంచి 3 గంటల అదనపు బ్యాటరీ లైఫ్ ఆప్షన్లు ఉన్నాయి. డీయోనైజ్డ్ వాటర్ వేపర్ ఛాంబర్ ఉంది. సెరామిక్ షీల్డ్ 2 మన్నికను అందిస్తుంది.