Ind vs Pak World Cup 2026 ( Image Credit to Original Source )
Ind vs Pak World Cup 2026 : క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్, పాక్ మ్యాచ్ కోసం చూస్తున్నారా? ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 15, 2026) జరగనుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు తలపడనున్నాయి.
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసమే ఉత్సాహంగా ఉన్నారు. మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు. మీరు కూడా భారత్, పాక్ మ్యాచ్ కోసం చూస్తుంటే మీకో అద్భుతమైన అవకాశం.. ప్రస్తుతం టెలికాం ఆపరేటర్లు జియోహాట్‌స్టార్ మొబైల్ యాక్సెస్‌తో స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో స్మార్ట్‌ఫోన్‌లలో లైవ్ మ్యాచ్ చూడొచ్చు. సరసమైన డేటాతో పాటు సబ్‌స్క్రిప్షన్‌ను కోరుకునే యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.
సరసమైన ధరలో భారత్ vs పాక్ మ్యాచ్‌ను లైవ్ చూసేందుకు జియో, విఐ, ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ఆప్షన్లను అందిస్తున్నాయి. మీరు జియో హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేకుండా T20 ప్రపంచ కప్‌ను ఫ్రీగా చూడొచ్చు.
మీరు ప్రీమియం కంటెంట్ యాక్సెస్ చేయాలనుకుంటే ఈ రీఛార్జ్ ప్లాన్‌లు ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ రీఛార్జ్ ప్లాన్‌లు రూ. 200 కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. టెలికాం ఆపరేటర్లు ఎంపిక చేసిన అధిక ధరల ప్లాన్‌లతో కూడా జియోహాట్‌స్టార్ యాక్సెస్ చేయొచ్చు.
జియో రూ.100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
తక్కువ బడ్జెట్‌లో స్పెషల్ డేటా ప్యాక్. జియో యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీతో 5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇందులో 30 రోజుల పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. క్రికెట్ మ్యాచ్ చూసేవారికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది. ఇది డేటా-ఓన్లీ ప్లాన్, దీనికి యాక్టివ్ బేస్ ప్లాన్ తప్పక ఉండాలి.
జియో రూ. 195 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఎక్కువ డేటా అవసరమైన యూజర్లకు రూ. 195 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 15GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. డేటా-ఓన్లీ ప్లాన్ యాక్టివ్ బేస్ ప్లాన్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
వోడాఫోన్ ఐడియా రూ. 44 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఈ వోడాఫోన్ ఐడియా రూ.44 ప్లాన్ అర్ధరాత్రి వరకు ఒక రోజు వ్యాలిడిటీతో 1GB డేటాను అందిస్తుంది. అయితే, ఇందులో 30 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
వోడాఫోన్ ఐడియా రూ. 101 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటాను అందిస్తుంది. ఇందులో నెల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఈ డేటా-ఓన్లీ ప్లాన్ కోసం యూజర్లు యాక్టివ్ బేస్ ప్లాన్ అందిస్తుంది.
వోడాఫోన్ ఐడియా రూ. 151 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
రూ.151 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో 4GB డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌తో పాటు 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. యాక్టివ్ బేస్ ప్లాన్ యూజర్లకు బెస్ట్ ప్లాన్.
వోడాఫోన్ ఐడియా రూ. 169 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో 8GB డేటాను అందిస్తుంది. ఇందులో 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. స్ట్రీమింగ్ కోసం హై-డేటా బెనిఫిట్స్ అందించే యాడ్-ఆన్ ప్లాన్. అయితే, యూజర్లకు యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే ఈ ప్లాన్ వర్క్ అవుతుంది.
జియో హాట్‌స్టార్ మొబైల్ యాక్సెస్‌తో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్లు :
ఎయిర్‌టెల్ రూ. 100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఈ డేటా ప్యాక్ 30 రోజుల పాటు 6GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. 30 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. డేటా యాడ్-ఆన్ ద్వారా యాక్టివ్ అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 195 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
రూ. 195 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో 12GB డేటాను అందిస్తుంది. నెల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. అదనంగా, మొబైల్ యూజర్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే బెనిఫిట్స్ పొందవచ్చు.