Tech Tips in Telugu : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఛార్జ్ ఎప్పుడు చేయాలి? బియ్యంలో ఇలా పెట్టారంటే పాడైనట్టే..!

Wet iPhone Warning : మీ ఐఫోన్ నీళ్లలో తడిస్తే వెంటనే ఛార్జ్ చేయవద్దు. సుమారు 30 నిమిషాల పాటు నీరు ఆరేంతవరకు అలానే ఎండబెట్టండి. ఆ తర్వాతే ఛార్జ్ చేయండి. తడి ఐఫోన్‌ను బియ్యంలో పెడితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Wet iPhone Warning

  • నీళ్లలో తడిసిన ఐఫోన్ వెంటనే ఛార్జ్ చేస్తే జరిగేది ఇదే
  • ఐఫోన్ నీళ్లలో తడిస్తే బియ్యంలో పెడితే ఏమౌతుందో తెలుసా?
  • తడిసిన ఐఫోన్ నుంచి ఏమైనా వార్నింగ్ అలర్ట్స్ వచ్చాయా?

Wet iPhone Warning : మీ ఐఫోన్ నీళ్లలో పడిందా? నీటిలో పడినా ఐఫోన్ వెంటనే ఛార్జ్ చేయొచ్చా? చాలామంది ఐఫోన్ వాటర్ రెసిస్టెన్స్ ఉందని వెంటనే ఛార్జింగ్ పెట్టేందుకు చూస్తుంటారు. ఇలా ఎప్పుడూ చేయొద్దు.

వాస్తవానికి, ఆపిల్ ఐఫోన్‌లో ఎన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నా కంపెనీ వాటర్ రెసిస్టెంట్‌గా తయారు చేసినా (Tech Tips in Telugu) నీళ్లు పడితే ఎంతటి ఎలక్ట్రిక్ డివైజ్ అయినా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియక వేలకు వేలు పోసి కొన్న ఖరీదైన ఫోన్ పాడు చేసుకుంటున్నారు.

సింపుల్‌గా చెప్పాలంటే.. నీరు కేవలం ఐఫోన్‌కే కాదు.. అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు డేంజరే.. ఐఫోన్ 12 తర్వాతలాంచ్ అయిన అన్ని ఐఫోన్‌లకు IP68 రేటింగ్ ఉంది. అంటే ఐఫోన్‌లు పూర్తిగా వాటర్‌ప్రూఫ్ అని కాదు. ఐఫోన్ నీటిలో తడిస్తే ఎలాంటి అలర్ట్ వస్తాయి? ఎంత సమయం తర్వాత ఛార్జింగ్‌లో పెట్టాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ తడిస్తే వార్నింగ్ సైన్స్ :
ఐఫోన్‌లోకి నీరు చేరిన వెంటనే రెండు రకాల అలర్ట్స్ ఇస్తుంది. ఫస్ట్ వార్నింగ్.. ‘ఛార్జింగ్ అందుబాటులో లేదు’ ఐఫోన్‌ను లైట్నింగ్ కేబుల్‌తో కనెక్ట్ చేయగానే వాటర్ డిటెక్ట్ అయితే వెంటనే ఈ వార్నింగ్ అలర్ట్ ఇస్తుంది. రెండవ అలర్ట్.. USB-C కనెక్టర్‌లో వాటర్ డిటెక్టెడ్ అని వస్తుంది.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్‌లో డబుల్ డిస్కౌంట్స్! ఈ ధరకు మళ్లీ రావు.. ఐఫోన్ నుంచి వివో వరకు సూపర్ ఆఫర్లు!

ఐఫోన్ USB-C పోర్ట్‌లో నీటిబిందువులు ఉన్నప్పుడు మాత్రమే ఈ అలర్ట్ వస్తుంది. ఐఫోన్‌లో మీకు ఇలాంటి అలర్ట్ కనిపిస్తే వెంటనే కేబుల్ నుంచి రిమూవ్ చేయండి. అలాగే, ఛార్జర్, కేబుల్‌ను కూడా తొలగించండి. తడిగా ఉన్న ఐఫోన్‌ను ఛార్జ్ చేస్తే పర్మినెంట్ డ్యామేజ్ జరగవచ్చని ఆపిల్ చెబుతోంది. అలాగే, ఛార్జింగ్ పోర్ట్, కేబుల్‌ కూడా పాడై పోయే ప్రమాదం ఉంది.

ఐఫోన్‌ ఎప్పుడు ఛార్జ్ చేయాలి? :
మీ ఐఫోన్‌లో నీరు చేరిందని అనుమానిస్తే.. నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నించండి. మీ చేతితో మెల్లగా ఫోన్‌పై తట్టండి. ఈ సమయంలో ఐఫోన్‌ను నిటారుగా పట్టుకుని ఛార్జింగ్ పోర్ట్ వైపు నుంచి మీ చేతి వైపు తట్టండి.

నీరంతా బయటకు వెళ్లిపోయాక అరగంట పాటు ఆరనివ్వండి. ఆపై ఛార్జర్‌కు కనెక్ట్ చేయండి. ఐఫోన్ ఛార్జ్ అయితే ఆందోళన అవసరం లేదు. అయితే, ఛార్జర్‌కు కనెక్ట్ చేసిన తర్వాత వార్నింగ్ మెసేజ్ మళ్లీ కనిపిస్తే ఐఫోన్‌ను 24 గంటల పాటు గాలి బాగా తగిలేలా సేఫ్ ప్లేసులో ఉంచండి. ఆ తర్వాత మాత్రమే ఐఫోన్‌ ఛార్జ్ చేయండి.

తడిసిన ఐఫోన్‌ను బియ్యంలో పెట్టొచ్చా? :
నీళ్లలో తడిసిన ఫోన్‌ను బియ్యంలో పెడితే ఆరిపోతుందని చాలా మంది నమ్ముతారు. మీరు కూడా అది నమ్మితే అంతే సంగతులు.. తడిసిన ఐఫోన్‌ను బియ్యంలో ఉంచతే అది పాడయ్యే అవకాశాలు ఎక్కువ. చిన్న చిన్న రేణువులు బియ్యంలోకి చేరి ఫోన్‌లోని ఇతర పార్టులను జామ్ చేసే ప్రమాదం ఉంది.