WhatsApp Bug For Beta Users
WhatsApp Bug Beta Users : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ బగ్ సమస్యను ఎదుర్కొన్నారా? చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే చాట్ గ్రీన్ స్ర్కీన్ కనిపిస్తుంది. ప్రత్యేకించి వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే ఈ బగ్ ఇష్యూ ఉన్నట్టుగా నివేదిస్తున్నారు.
చాట్ ఓపెన్ చేయగానే డివైజ్ స్టక్ అవుతుంది. అంతేకాకుండా, ఈ బగ్ మొత్తం డిస్‌ప్లేను ఆకుపచ్చగా మార్చేస్తుంది. దీనికి వాట్సాప్ డివైజ్‌లో క్లోజ్ చేయడం తప్ప మరో మార్గం లేదు. ఒకవేళ మళ్లీ వాట్సాప్ ఆన్ చేస్తే.. అదే సమస్య తలెత్తుతోంది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో వాట్సాప్ బీటా వెర్షన్ 2.24.24.5 బగ్ ఇష్యూ కారణంగా చెప్పవచ్చు.
వినియోగదారులు చాట్ లేదా మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది. యాప్ యాక్టివ్‌గా ఉన్నంత వరకు ఈ బగ్ తాత్కాలికంగా స్క్రీన్ పూర్తిగా గ్రీన్ కలర్‌లోకి మారుతుంది. ఓఎల్ఈడీ స్క్రీన్‌లలో తరచుగా కనిపించే గ్రీన్ లైన్ సమస్య తలెత్తుతోంది. హార్డ్‌వేర్ దెబ్బతినడం వల్ల ఒకే వరుస పిక్సెల్‌లు శాశ్వతంగా ఆకుపచ్చ రంగును ప్రదర్శిస్తాయి. ఈ పరిస్థితిలో యూజర్ వాట్సాప్‌ను ఓపెన్ చేసినప్పుడు మాత్రమే స్క్రీన్ మొత్తం గ్రీన్ కలర్‌లోకి మారుతుంది.
Anyone facing the same issue with WhatsApp? Green screen when you open the chats? #WhatsApp pic.twitter.com/zwabmH8f3C
— JR 🧉 (@Messisznn) November 9, 2024
యాప్ క్లోజ్ చేసిన వెంటనే సాధారణ స్థితికి వస్తుంది. అయితే, వాట్సాప్ స్టేబుల్ వెర్షన్‌లో అలాంటి సమస్య లేదు. అలాగే, ఈ బగ్ ఆండ్రాయిడ్ యూజర్లను మాత్రమే ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే ఐఓఎస్ వాట్సాప్ బీటా టెస్టర్లు ఈ సమస్యను రిపోర్టు చేయలేదు. కొంతమంది వినియోగదారులు స్టేబుల్ వెర్షన్‌కి డౌన్‌గ్రేడ్ చేసిన తర్వాత కూడా బగ్ అలాగే ఉందని నివేదించారు. అలా అయితే, టాబ్లెట్, ల్యాప్‌టాప్ లేదా ఐఫోన్ వంటి మరో ఫోన్లలో వాట్సాప్ వాడేందుకు ప్రయత్నించండి.
వాట్సాప్ గ్రీన్ స్క్రీన్ బగ్‌ని ఎలా ఫిక్స్ చేయాలి? :
వాట్సాప్ ప్రస్తుతం గూగుల్ లెన్స్ మాదిరిగానే ఆన్‌లైన్‌లో చాట్ మెసేజ్ ద్వారా షేర్ చేసిన ఫొటోలను అథెంటికేషన్ ధృవీకరించడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ‘వెబ్‌లో సెర్చ్ ఫోటోస్’ ఫీచర్ తప్పుడు సమాచారాన్ని నియంత్రించవచ్చు.
Read Also : WhatsApp Search Images : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. యాప్‌లో నేరుగా వెబ్‌లో ఫొటోలను సెర్చ్ చేయొచ్చు..!