Whatsapp Username : వాట్సాప్‌లో కొత్త ‘యూజర్‌నేమ్’ ఫీచర్.. ఇక ఫోన్ నంబర్ లేకుండానే చాట్ చేయొచ్చు.. ఎలా వాడాలంటే?
Whatsapp Username : వాట్సాప్‌లో ఇకపై ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్ ఫీచర్ వాడొచ్చు. రెగ్యులర్ అప్ డేట్ ఇంకా రాలేదు. ప్రస్తుతానికి బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ వచ్చాక మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఈజీగా సెటప్ చేసుకోవచ్చు.
- Sreehari A
- Published On : April 9, 2026 / 04:01 PM IST
Whatsapp Username
- వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్.. ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేదు
- మీ స్పెషల్ యూజర్‌నేమ్‌తో సెర్చ్ చేసి యూజర్లు కనెక్ట్ అవ్వొచ్చు
- ప్రస్తుతం లిమిటెడ్ గానే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులో ఉంది
- అతి త్వరలో రెగ్యులర్ వాట్సాప్ యూజర్లందరికి రిలీజ్ కానుంది
Whatsapp Username : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త యూజర్ నేమ్ ఫీచర్ వచ్చింది చూశారా? ఇకపై మొబైల్ నెంబర్లతో పనిలేకుండా యూజర్ నేమ్‌తోనే వాడుకోవచ్చు. ఈ క్రేజీ ఫీచర్ క్రమంగా యూజర్ల అందరికి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్‌ను ఎలా పొందాలి? ఎలా సెటప్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మీ ఫోన్ నంబర్ హైడ్ అవుతుంది. ఆ యూజర్‌నేమ్‌తో మిమ్మల్ని వాట్సాప్‌లో సెర్చ్ చేయొచ్చు. టెలిగ్రామ్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను మాదిరిగానే ఉంటుంది. వాట్సాప్ ఈ ఫీచర్‌ను దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచర్ మీ ఫోన్‌లో వెంటనే కావాలంటే వాట్సాప్ బీటా వెర్షన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ ఫీచర్ ఎలా పొందాలి? :
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ చాలా కాలంగా బీటా వెర్షన్‌లో టెస్టింగ్ జరుగుతోంది. వాట్సాప్ దశలవారీగా స్టేబుల్ వెర్షన్ రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ మీ ఫోన్‌కు వచ్చేందుకు ఇంకా సమయం ఉంది. ముందుగానే ఈ ఫీచర్ పొందాలంటే వాట్సాప్ బీటా వెర్షన్‌లో రిజిస్టర్ చేసుకోండి.
Read Also : Apple iPhone 17 Pro : ఇది కదా డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు!
గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్ కోసం సెర్చ్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే వాట్సాప్ బీటా వెర్షన్‌లో రిజిస్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. బీటా వెర్షన్‌లో రిజిస్టర్ అనేది లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే బీటా వెర్షన్‌లో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెక్ చేస్తూ ఉండాలి. అయితే, మీరు ఒకసారి బీటా వెర్షన్‌లో రిజిస్టర్ చేసుకున్నాక యూజర్‌నేమ్ ఫీచర్‌ను వెంటనే సెటప్ చేసుకోవచ్చు.
యూజర్‌నేమ్ ఫీచర్ ఎలా సెటప్ చేయాలి? :
- యూజర్‌నేమ్ ఫీచర్ బీటా లేదా స్టేబుల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
- మీ ఫోన్‌కు వచ్చిన వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెటప్ చేసుకోవచ్చు
- వాట్సాప్ చాట్ ట్యాబ్ పైభాగంలో త్రి డాక్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లవచ్చు.
- ఆ తర్వాత మీకు కొత్త ప్రొఫైల్ పేరు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు నచ్చిన యూజర్‌నేమ్‌ను టైప్ చేయండి.
- మీ యూజర్‌నేమ్ సెట్ అవుతుంది.
మీ యూజర్‌నేమ్‌ను సెట్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
- యూజర్‌నేమ్ కనీసం 3 గరిష్టంగా 35 క్యారెక్టర్ల వరకు ఉండవచ్చు.
- wwwతో మీ యూజర్ నేమ్ ప్రారంభం కాకూడదు.
- యూజర్‌నేమ్ చివర .com లేదా .net వంటి డొమైన్ వాడొద్దు
- యూజర్‌నేమ్‌లో తప్పనిసరిగా ఒక లెటర్ ఉండాలి.
- కేవలం ఐకాన్స్ యూజర్‌నేమ్‌గా సెట్ చేయలేరు.
