Whatsapp New Feature : పండగ చేస్కోండి.. ఇకపై వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదవొచ్చు.. అక్కడే రిప్లయ్ ఇవ్వొచ్చు.. ఎలాగంటే?
Whatsapp New Feature : వాట్సాప్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతుంది. ఇకపై వాట్సాప్ యాప్ ఓపెన్ చేయకుండానే వచ్చిన మెసేజ్ కు అక్కడే రిప్లయ్ ఇవ్వొచ్చు.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
- Sreehari A
- Published on- April 25, 2026 / 01:02 PM IST
- వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్.. కొత్త ఫీచర్ సూపర్
- ఫేస్‌బుక్ మెసెంజర్ మాదిరిగా ఫ్లోటింగ్ చాట్ బబుల్స్ ఫీచర్
- మల్టీటాస్కింగ్ కూడా స్మాల్ విండో ద్వారా రిప్లయ్ ఇవ్వొచ్చు
- ఆండ్రాయిడ్ 11 ఆపై వెర్షన్‌లలో సపోర్టు చేస్తుంది
- ముందుగా బీటా యూజర్ల కోసం రిలీజ్ కానుంది
Whatsapp New Feature : వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేస్తోంది. ఇకపై వాట్సాప్ మెసేజ్ వచ్చిన ప్రతిసారీ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. మెసేజ్ కనిపించగానే చదివేసి అక్కడే రిప్లయ్ ఇచ్చేయొచ్చు.. ప్రస్తుతం మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ బబుల్ నోటిఫికేషన్స్ అనే కొత్త ఫీచర్‌పై వర్క్ చేస్తోంది.
కొత్త మెసేజ్ వచ్చినప్పుడు ఈ బబుల్ నోటిఫికేషన్‌లు స్క్రీన్‌పై (Whatsapp New Feature) కనిపిస్తాయి. వినియోగదారులు కొత్త మెసేజ్ ఈజీగా చదవడంతో పాటు రిప్లయ్ కూడా ఇచ్చేందుకు వీలుంటుంది. తద్వారా వాట్సాప్ యాప్‌ను పదేపదే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.
వాట్సాప్ కొత్త ఫీచర్ ఇదే :
వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ అప్‌డేట్ గురించి వాబెటాఇన్ఫో షేర్ చేసింది. ఈ కొత్త ఫీచర్‌ను నోటిఫికేషన్ బబుల్స్ పేరుతో ప్రవేశపెట్టనుందని నివేదిక పేర్కొంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. ప్రస్తుతం బీటాలో టెస్టింగ్ అవుతోంది.
Read Also : Jio Gaming Plan : గేమ్ ఛేంజర్ ప్లాన్.. జియో కొత్త ప్లాన్ అదిరిందిగా.. 28 రోజులు మీ గేమ్ ఇష్టం.. ఫుల్ ఎంజాయ్!
యూజర్ల మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు వాట్సాప్ కొత్త టూల్‌తో సహా డిజైన్‌లో మార్పులు చేస్తోంది. ఈ కొత్త టూల్ ద్వారా యూజర్లు మెసేజ్‌లను త్వరగా చదివి రిప్లై ఇవ్వొచ్చు. వాట్సాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు ఇతర యాప్‌లను క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు.
వాబెటాఇన్ఫో పోస్ట్ వైరల్ :
వాబెటైన్ఫో రిపోర్టు ప్రకారం.. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా వాట్సాప్ షేర్ చేసింది. ఆ మెసేజ్ స్క్రీన్‌పై తేలుతున్నట్లుగా కనిపిస్తుంది.
ఇక ముఖ్యమైన మెసేజ్ మిస్ అవ్వరు :
బబుల్ ఇంటర్‌ఫేస్ ద్వారా మీరు మెసేజ్ త్వరగా చూడవచ్చు. అవసరమైతే రిప్లయ్ కూడా ఇవ్వవచ్చు. బబుల్ ఫీచర్ ఇదివరకే యాక్టివ్ ఉన్న చాట్‌లకు మాత్రమే సపోర్టు ఇస్తుంది.
ఉదాహరణకు.. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసి వర్క్ బిజీగా ఉన్నప్పుడు మీకు ముఖ్యమైన వాట్సాప్ మెసేజ్ వస్తే.. మీరు ఇతర యాప్‌ను క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు స్క్రీన్ పై వాట్సాప్ మెసేజ్ చూడొచ్చు. చదవచ్చు కూడా.. అలాగే ఆ మెసేజ్ యాప్ ఓపెన్ చేయకుండానే రిప్లయ్ కూడా ఇవ్వొచ్చు.
వాట్సాప్ బబుల్ నోటిఫికేషన్ ఎలా పనిచేస్తుంది? :
గ్రూప్ లేదా పర్సనల్ చాట్‌లో కొత్త మెసేజ్ వచ్చిన వెంటనే మీ ఆండ్రాయిడ్ స్క్రీన్‌పై వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ బబుల్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి యూజర్లు ఈజీగా చాట్ చేయవచ్చు.
