WhatsApp Profile Photo : వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఫొటో అందరికి కనిపించొద్దా? ఈ చిన్న సెట్టింగ్‌తో హైడ్ చేసేయండి..

WhatsApp Profile Photo : మీ ప్రొఫైల్ ఫొటోను అందరూ కనిపించకుండా ఉండేలా వాట్సాప్‌లో ఈజీ ప్రైవసీ సెట్టింగ్ ఉంది. ఈ సెట్టింగ్‌ను ఎలా మార్చాలి? మీ ఫొటోను ఎవరి నుంచి హైడ్ చేయొచ్చో తెలుసుకోండి.

WhatsApp Profile Photo

  • వాట్సాప్‌లో మీ ఫోటో ఎవరు చూడాలి?
  • ఈ సెట్టింగ్‌తో ఫొటోను హైడ్ చేసేయండి
  • మీ వాట్సాప్ ఫొటో అందరికీ కనిపించకూడదా?

WhatsApp Profile Photo : వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన ప్రైవసీ ఫీచర్.. చాలామంది వాట్సాప్ యూజర్లు ప్రొఫైల్ ఫొటోను ప్రైవసీగా పెట్టుకుంటారు. కొంతమందికి మాత్రమే తమ ఫొటో కనిపించాలని అనుకుంటారు. అందులో స్నేహితులు, కుటుంబ సభ్యులు సహా అందరి కాంటాక్టులు ఉంటాయి. అయితే, వాట్సాప్ కాంటాక్టుల్లో కొన్నిసార్లు ఏదో ఒక పని అవసరమై చాలా మంది ఫోన్ నెంబర్లను సేవ్ చేస్తుంటాం.

దాంతో కాంటాక్టు లిస్టులోని అందరికి మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో డిఫాల్ట్ కనిపిస్తుంది. అలా కాకుండా కొంతమందికి మాత్రమే మీ ప్రొఫైల్ ఫొటో కనిపించాలని భావిస్తే దానికి తగినట్టుగా ప్రైవసీ సెట్టింగ్ ఆన్ చేయాలి. తద్వారా మీ ప్రొఫైల్ ఫొటో మీకు నచ్చిన వారికి మాత్రమే కనిపించి మిగతావారికి కనిపించదు. ఇంతకీ ఈ సెట్టింగ్ ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రొఫైల్ ఫొటో హైడింగ్ సెట్టింగ్స్ :
వాట్సాప్ మీ ప్రొఫైల్ ఫొటో ప్రైవసీని మార్చుకునే అవకాశం అందిస్తోంది. ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడవచ్చు? ఎవరు చూడకూడదో మీరే డిసైడ్ చేయొచ్చు. మీ ఫొటోను కొందరి వ్యక్తుల నుంచి కనిపించకుండా హైడ్ చేయాలంటే‘My Contacts Except’ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఈ సెట్టింగ్‌ ఎంచుకుంటే మీ కాంటాక్ట్స్ లిస్టులోని వ్యక్తులు మీ ప్రొఫైల్ ఫొటోను చూడలేరు.

ప్రొఫైల్ ఫొటో హైడ్ చేయడం ఎలా? :
ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. వాట్సాప్‌పై రైట్ కార్నర్‌లో 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రైవసీ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. మీకు ప్రొఫైల్ ఫొటో ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి.‘My Contacts Except’ను ఎంచుకోండి.

Read Also : iPhone 18 Series : ఆపిల్ లవర్స్‌కు డబుల్ ధమాకా.. ఐఫోన్ 18 ప్రోతో ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్! ధర, ఫీచర్లు లీక్

ఆ తర్వాత, మీ ప్రొఫైల్ ఫొటోను ఎవరి నుంచి హైడ్ చేయాలో వారిని సెలెక్ట్ చేసుకోండి. వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్‌ను Save చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులు మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను ఇకపై చూడలేరు.

మీ ప్రొఫైల్ ఫొటో ఎవరికీ కనిపించొద్దా? :
మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరికీ కనిపించొద్దని భావిస్తే (Nobody) అనే ఆప్షన్‌ ఎంచుకోండి. తద్వారా మీ ప్రొఫైల్ ఫొటో ఏ వాట్సాప్ యూజర్‌కు కనిపించదు. అయితే, మీరు సేవ్ చేసుకున్న కాంటాక్ట్‌లు మాత్రమే మీ ఫొటోను చూడాలంటే (My Contacts) అనే ఆప్షన్‌ ఎంచుకోండి. ఇలా వాట్సాప్ మీ ప్రైవసీకి తగినట్టుగా ప్రొఫైల్ ఫొటో ప్రైవసీని కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఈ సెట్టింగ్ ప్రైవసీకి అవసరం :
కొన్నిసార్లు మనకు పెద్దగా పరిచయడం లేని వ్యక్తుల నంబర్లను సేవ్ చేస్తుంటాం. కానీ, వారు మన ఫోటోలను చూడటం మనకు ఇష్టం ఉండదు. ఇలాంటి సందర్భాలలో మీ ఫొటోను అందరి కాంటాక్ట్‌ల నుంచి హైడ్ చేయాల్సిన పనిలేదు.

‘My Contacts Except’ అనే ఆప్షన్, కేవలం కొద్దిమందిని ఎంచుకుని, వారి నుంచి మీ ఫోటోను హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఫోటో విషయంలో ప్రైవసీ కోసం ఈ సింపుల్ సెట్టింగ్ ఆన్ చేసి ఏయే కాంటాక్టులు చూడొద్దో అవి సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఇకపై మీ ప్రొఫైల్ ఆ కాంటాక్టులకు కనిపించదు.