WhatsApp New Update : యూజర్లకు బిగ్ అలర్ట్.. ఈ మొబైల్ ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!
WhatsApp New Update : వాట్సాప్ కొత్త అప్ డేట్ రాబోతుంది. ఇకపై పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఏయే ఫోన్లలో వాట్సాప్ సపోర్టు నిలిచిపోనుందంటే?
- Sreehari A
- Published on- April 28, 2026 / 05:24 PM IST
WhatsApp New Update
- ఆండ్రాయిడ్ 5.0, 5.1 వెర్షన్ డివైజ్‌లలో వాట్సాప్ పనిచేయదు
- పాత కొత్త ఫోన్‌లను వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవడం బెటర్
- వాట్సాప్ నోటిఫికేషన్ల ద్వారా యూజర్లకు అలర్ట్ పంపుతోంది
- డేటా లాస్ కాకుండా చాట్‌లను బ్యాకప్ చేసుకోవాలని సూచిస్తోంది
WhatsApp New Update : మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇది మీకోసమే ఈ ఏడాది చివర్లో పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లకు సపోర్టును పూర్తిగా ఆపేయనుంది వాట్సాప్. కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ ఇక పనిచేయదు.
సెప్టెంబర్ రెండో వారం నుంచి 6.0 కన్నా తక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లు ఉన్న ఫోన్లలో వాట్సాప్‌కు ఇకపై సపోర్టు ఉండదు. ఇదివరకే ఆండ్రాయిడ్ 5.0, 5.1 లకు సపోర్టు నిలిపివేసినట్టు వాట్సాప్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లు సపోర్ట్ నిలిపివేయనుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, సేఫ్టీ కొత్త ఫీచర్లతో సపోర్టు అందిస్తుంది. ఆండ్రాయిడ్ 17 వెర్షన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ముఖ్యంగా భారత్, బ్రెజిల్, ఆగ్నేయాసియాలోని భారీ సంఖ్యలో యూజర్లు ఇకపై కొత్త అప్‌డేట్‌లు పొందలేరు.
దీనికి సంబంధించి వాట్సాప్ యాప్‌లోనే యూజర్లకు అలర్ట్స్ పంపుతోంది. సపోర్ట్ ముగిశాక ఈ డివైజ్‌లలో వాట్సాప్ పనిచేయదు. ఒకవేళ యూజర్లు ఆయా ఫోన్లలో వాట్సాప్ వాడాలంటే సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవాలి లేదా కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారాలి.
వాట్సాప్ డేటా లాస్ కాకుండా చాట్‌లను బ్యాకప్ చేసుకోవాలని కూడా కంపెనీ సూచిస్తోంది. క్లౌడ్ సర్వీసుల ద్వారా లేదా డివైజ్ లోకల్ కాపీని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాన్యువల్‌గా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఐఫోన్‌లు, ఐప్యాడ్ యూజర్లు సపోర్టు చేసే iOS వెర్షన్‌లను వాడితేనే బెటర్.
ఇదిలా ఉండగా, వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా అనేక కొత్త ఫీచర్లను వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. ఈ ప్లాన్ కస్టమ్ థీమ్‌లు, పిన్ చేసిన చాట్‌లు స్పెషల్ స్టిక్కర్‌ల వంటి బెనిఫిట్స్ పొందవచ్చు. ఈజీ మల్టీటాస్కింగ్ కోసం నోటిఫికేషన్ బబుల్స్, iOSలో ప్రైవేట్ చాట్ సమ్మరీస్, బిజినెస్ మెసేజ్ కోసం టూల్స్ కూడా ఈ ప్లాట్‌ఫామ్ అందించనుంది.
