WhatsApp Noise Cancellation : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక ట్రాఫిక్‌లో ఉన్నా కాల్స్ క్లారిటీగా వినిపిస్తాయి.. ఎలాగంటే?

WhatsApp Noise Cancellation : వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటాలో కొత్త నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను కూడా తగ్గిస్తుంది.

WhatsApp Noise Cancellation

  • వాట్సాప్ కాల్స్‌లో బ్యాక్ గ్రౌండ్ సౌండ్ రియల్ టైంలో తగ్గుతుంది
  • ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. అవసరమైతే కాల్స్ సమయంలో ఆఫ్ చేయొచ్చు
  • మెరుగైన ఎక్స్‌పీరియన్స్ కోసం ఇద్దరు యూజర్లకు ఈ ఫీచర్ తప్పనిసరి

WhatsApp Noise Cancellation : వాట్సాప్ యూజర్లకు పండగే.. వాట్సాప్ కొత్త కాలింగ్ ఫీచర్ తీసుకువస్తోంది. ఈ కొత్త నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ అతి త్వరలోనే లాంచ్ కానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

వాయిస్, వీడియో కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. ఈ ఫీచర్ ట్రాఫిక్, ఎయిర్, పరిసర శబ్దాలను రియల్ టైమ్‌లో ఫిల్టర్ చేస్తుంది. తద్వారా కాల్స్ సమయంలో వాయిస్ మరింత స్పష్టంగా వినిపిస్తుంది.

నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.26.14.1లో ఈ ఫీచర్ కనిపించింది. డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. కాల్ ప్రారంభమైన వెంటనే ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. యూజర్లు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే, ఒకవేళ ఆడియోను మరీ ఎక్కువగా ఫిల్టర్ చేస్తుంటే కాల్ సమయంలో ఆఫ్ చేసేందుకు ఆప్షన్ కూడా ఉంది.

Read Also : EPFO 3.0 Update : ఈపీఎఫ్ఓ బిగ్ అప్‌డేట్.. PF డబ్బులు మొత్తం తీస్తున్నారా? ఏటీఎం, UPIతో ఎంత విత్‌డ్రా చేయొచ్చంటే?

ఈ వాట్సాప్ ఫీచర్ యూజర్లు పంపే ఆడియోలో అవతలి వ్యక్తికి మీరు చెప్పేది స్పష్టంగా వినిపిస్తుంది అనమాట. అయితే, అవతలి యూజర్ ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయకపోతే ఆడియో క్లారిటీ సరిగా ఉండదు. అందుకే వాట్సాప్ యూజర్లు ఇద్దరూ తప్పనిసరిగా తమ ఫోన్లలో ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉండాలి.

ఈ ప్రాసెసింగ్ పూర్తిగా డివైజ్‌లోనే జరుగుతుందని సమాచారం. మైక్రోఫోన్ నుంచి వచ్చే ఆడియోను మొదట ఫిల్టర్ చేసి, ఆపై పంపే ముందు ఎన్‌క్రిప్ట్ అవుతుంది. తద్వారా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు ఎలాంటి ఆటంకం కలగదు.

ఈ ఫీచర్ మార్చిలో వాట్సాప్ బీటా వెర్షన్ 2.26.11.8లో డెవలప్ స్టేజీలో ఉండగా ఫస్ట్ టైమ్ రివీల్ అయింది. ఇప్పుడు టెస్టింగ్ కోసం రిలీజ్ కానుంది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులో ఉంది. కానీ, రాబోయే వారాల్లో మరింత మంది బీటా యూజర్లకు రిలీజ్ కానుంది. ఆపై రెగ్యులర్ యూజర్లకు స్టేబుల్ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది.