WhatsApp Status Reply Bar : వాట్సాప్‌‌లో సరికొత్త ఫీచర్.. స్టేటస్‌లో కొత్త రిప్లయ్ బార్ చూడొచ్చు..!

WhatsApp Status Reply Bar : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రానుంది. స్టేటస్-వ్యూయింగ్ ఎక్స్‌పీరియంగ్ స్టేటస్ అప్‌డేట్‌ల కోసం కొత్త రిప్లయ్ బార్‌ ఫీచర్ తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోందని నివేదిక వెల్లడించింది.

WhatsApp will soon roll out a new reply bar for Status on Android and iOS

WhatsApp Status Reply Bar : ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్‌ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ లేటెస్టుగా మరో కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ప్రత్యేకించి స్టేటస్ అప్‌డేట్‌ల కోసం కొత్త రిప్లయ్ బార్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులకు స్టేటస్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ మరింత ఇంటరాక్టివ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. (WABetaInfo) నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also : Samsung Galaxy S22 : కొత్త ఫోన్ కావాలా? భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

వాట్సాప్ త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యాప్‌లలో ఏకకాలంలో టెస్టింగ్ చేస్తోంది. రెండు ప్లాట్‌ఫారమ్‌లలో ఏకకాలంలో టెస్టింగ్ చేయడమంటే.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు యాప్ స్టేబుల్ వెర్షన్‌కు ఫీచర్ త్వరలో రిలీజ్ చేయనుందని అర్థం. రిప్లయ్ బార్‌తో వాట్సాప్ తప్పనిసరిగా స్టేటస్ అప్‌డేట్‌లతో మరింత ఇంటరాక్ట్ అయ్యేలా వినియోగదారులను ప్రాంప్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇన్‌స్టా స్టోరీ మాదిరిగా స్టేటస్ రిప్లయ్ బార్ :
రాబోయే ఈ కొత్త ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోని రిప్లయ్ బాక్సును పోలి ఉంటుంది. ప్రతి లేదా ఏదైనా స్టోరేజీకి మెసేజ్‌తో రిప్లయ్ ఇచ్చేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. వాట్సాప్ రిప్లయ్ ఫీచర్ ఎలా ఉంటుందో స్క్రీన్‌షాట్‌ను కూడా నివేదిక షేర్ చేసింది. స్టేటస్ అప్‌డేట్‌ను చూసే స్క్రీన్ దిగువన రిప్లై బార్‌ను చూడవచ్చు.

WhatsApp reply bar for Status 

రిప్లయ్ బాక్సుపై నొక్కడం ద్వారా వినియోగదారులు వ్యక్తిగత స్టేటస్ అప్‌డేట్ మెసేజ్ రిప్లయ్ ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చూసినట్లుగా ప్రతి స్టేటస్ అప్‌డేట్ ద్వారా ఈ రిప్లయ్ బార్ స్టేబుల్‌గా కనిపిస్తుంది. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లోని ప్రస్తుత డిజైన్‌లా కాకుండా సరికొత్తగా ఉండనుంది. వినియోగదారులు రిప్లయ్/మెసేజ్ ఆప్షన్‌ను యాక్సెస్ చేసేందుకు పైకి స్వైప్ చేయాల్సి ఉంటుంది.

సింగిల్ ట్యాప్‌తో రెండింటిలో షేరింగ్ :
ప్రస్తుతం, ఇన్‌స్టాగ్రామ్ రిప్లయ్ బార్ ద్వారా జిఫ్ స్టోరీలకు రిప్లయ్ ఇవ్వడానికి కూడా సపోర్టు ఇస్తుంది. వాట్సాప్‌లోని రిప్లయ్ బార్ బీటా వెర్షన్‌లో ఈ సామర్థ్యాన్ని అందించలేదు. అయితే, వాట్సాప్ చివరికి ఆ ఫీచర్‌ను కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో స్టేటస్ ఫీచర్‌ను ఏదో ఒక అప్‌డేట్‌తో పుష్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్షేర్ చేసే సామర్థ్యాన్ని టెస్టింగ్ చేసింది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను నేరుగా ఫేస్‌బుక్ స్టోరీలకు షేర్ చేసే సామర్థ్యాన్ని పోలి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫీచర్‌తో వినియోగదారులు వాట్సాప్ యాప్ నుంచి నిష్క్రమించకుండానే ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా షేర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌కి స్టోరీలను క్రాస్-పోస్ట్ చేసే ప్రస్తుత ఆప్షన్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫంక్షనాలిటీ వాట్సాప్ యూజర్లు తమ వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ రెండింటినీ కేవలం ఒక ట్యాప్‌తో అప్‌డేట్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : iQOO 12 Launch : అద్భుతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ 12 ఫస్ట్ ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంతంటే?