Jio OTT Prepaid Plans : జియో మల్టీ OTT ప్రీపెయిడ్ ప్లాన్లు.. సింగిల్ రీఛార్జ్‌తో 10కిపైగా ఓటీటీ యాప్స్ ఫ్రీ.. డేటా, కాలింగ్ బెనిఫిట్స్ కూడా!
Jio OTT Prepaid Plans : జియో యూజర్ల కోసం మల్టీ ఓటీ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 175 నుంచి ఫ్రీగా 10 వరకు ఓటీటీ యాప్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.
Jio OTT Prepaid Plans ( Image Credit to Original Source)
- మొబైల్, ఓటీటీ స్ట్రీమింగ్ కోసం జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
- ప్రైమరీ OTT యాక్సెస్, కాలింగ్‌తో రోజువారీ డేటా, ప్రీమియం ప్లాన్
- అదనపు ఛార్జీలు లేకుండా అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్
- రూ. 175 నుంచి రూ. 500 కన్నా తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు
Jio OTT Prepaid Plans : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. మొబైల్ డేటా, ఎంటర్ టైన్మెంట్ కోరుకునే యూజర్ల కోసం అద్భుతమైన ఓటీటీ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో మల్టీ ఓటీటీ యాప్స్ యాక్సస్ చేయొచ్చు.
ఈ ప్లాన్లతో స్ట్రీమింగ్ యాప్ కోసం సపరేటుగా చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను సింగిల్ రీఛార్జ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్లు వివిధ రకాల యూజర్ల కోసం అందుబాటులో ఉన్నాయి.
ఉదాహరణకు, కొన్ని ప్లాన్లు ఓటీటీ యాక్సెస్ మాత్రమే కోరుకునే యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజువారీ డేటా, అదనపు బెనిఫిట్స్ అందిస్తాయి. ఓటీటీ ప్లాన్ల ప్రారంభ ధర కేవలం రూ. 175 నుంచి రూ. 500 కన్నా తక్కువకే లభిస్తున్నాయి.
ప్రస్తుతం, జియో మల్టీ-ఓటీటీ సర్వీసులను అందించే 3 ప్రీపెయిడ్ ప్లాన్లతో వస్తుంది. ఈ ప్లాన్ల ధర రూ. 175, రూ. 445, రూ. 500కు లభిస్తున్నాయి. ఈ కింది జాబితా చేసిన ప్లాన్లలో మల్టీ ఓటీటీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, జియో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లేదా జియోహాట్‌స్టార్ వంటి ఇతర ప్లాన్లు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్లను మైజియో యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
Read Also : Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ తగ్గింపు.. రూ.36వేల ఫోన్ రూ.24,150కే.. ఎలాగంటే?
జియో రూ.175 ప్లాన్ :
సరసమైన ఓటీటీ ప్లాన్లలో జియో రూ.175 ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను అతి తక్కువ ధర పొందవచ్చు. 10GB హై-స్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డేటా యాడ్-ఆన్ ప్లాన్ అందిస్తుంది.
అయితే, యూజర్లకు కాలింగ్ బెనిఫిట్స్ కోసం ఇప్పటికే యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండాలి. ఓటీటీ బెనిఫిట్స్ పరంగా ప్లాన్‌లో SonyLIV, ZEE5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, SunNXT, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, జియోటీవీ ఉన్నాయి.
జియో రూ.445 ప్లాన్ :
ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా ఓటీటీ కంటెంట్‌తో వస్తుంది. వినియోగదారులు 28 రోజుల పాటు రోజుకు 2GB డేటా పొందవచ్చు. అంతేకాదు.. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్ లిమిటెడ్ 5జీ డేటాను కూడా పొందవచ్చు.
పైన పేర్కొన్న బెనిఫిట్స్ మాత్రమే కాదు.. వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో సోనీలైవ్, జీ5, లయన్స్ గేట్, ప్లే, డిస్కవరీ ప్లస్ ప్లానెట్ మరాఠి, జియోటీవీ వంటి మరిన్ని ఉన్నాయి.
జియో రూ.500 ప్లాన్ :
ఈ రూ. 500 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రీమియం ఎంటర్టైన్మెంట్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫుల్ మొబైల్ బెనిఫిట్స్‌తో ఓటీటీ లైనప్ కోరుకునే యూజర్ల కోసం అందిస్తోంది. రూ.500 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్, 28 రోజుల పాటు అందిస్తుంది.
కనెక్టివిటీ బెనిఫిట్స్ కోసం ఈ ప్లాన్ యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్, జియోహాట్ స్టార్, సోనీలైవ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ప్లానెట్ మరాఠి, ఫ్యాన్ కోడ్, జియోటీవీ వంటి 10కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ అందిస్తుంది.
