Whatsapp New Feature : వాట్సాప్‌లో కిర్రాక్ ఫీచర్ బ్రో.. ఇక చదవని చాట్స్ అన్నీ సెకన్లలో చూసేయొచ్చు.. ఎలాగంటే?
Whatsapp New Feature : వాట్సాప్‌లో ఇప్పుడు అన్‌రీడ్ చాట్‌లన్నింటినీ సెకన్లలో చదవొచ్చు. ఈ అద్భుతమైన ఫీచర్ వస్తోంది. వినియోగదారులకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published On : March 30, 2026 / 07:32 PM IST
Whatsapp New Feature
- వాట్సాప్ లో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది
- అన్ రీడ్ చాట్ సమ్మరీ ఫీచర్ బెనిఫిట్స్ ఏంటి?
- ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లలో టెస్టింగ్
Whatsapp New Feature : వాట్సాప్ యూజర్లకు బిగ్ న్యూస్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతుంది. ఇకపై మీరు వాట్సాప్ లో చదవని మెసేజ్ లను ఒకేచోట చదివేయొచ్చు. ఈ స్పెషల్ ఫీచర్ ఒకసారి అందుబాటులోకి వస్తే.. మీరు చదవని మెసేజ్ సమ్మరీని ఈజీగా చూడొచ్చు.
ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఇతర మెసేజ్ లన్నీ చదివే పరిస్థితి ఉండదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త అన్ రీడ్ చాట్ సమ్మరీ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా సెకన్లలోనే అన్ని చదవని చాట్స్ ఈజీగా చూసేయొచ్చు.. ఈ సరికొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అన్ రీడ్ చాట్ సమ్మరీ ఫీచర్ ఏంటి? :
రాబోయే ఈ కొత్త ఫీచర్ యూజర్లు చదవని అనేక చాట్‌ల సమ్మరీని ఒకేసారి చూసేందుకు వీలుంటుంది. ప్రతి చాట్‌ను ఓపెన్ చేసి లాంగ్ చాట్స్ చదవాల్సిన అవసరం ఉండదు. అనేక గ్రూపులలో ఉంటూ ప్రతి మెసేజ్ చదవలేని వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? :
వాట్సాప్ ఈ ఫీచర్ కోసం ప్రైవేట్ ప్రాసెసింగ్ అనే స్పెషల్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. యూజర్లు చాట్ సమ్మరీని రిక్వెస్ట చేస్తే కొత్త, చదవని మెసేజ్ మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఆ తర్వాత ఒక సేఫ్ సిస్టమ్‌లో సమ్మరీ క్రియేట్ అవుతుంది అనమాట.
📝 WhatsApp beta for Android 2.26.12.10: what’s new?
WhatsApp is working on a feature that lets users summarize multiple unread chats, and it will be available in a future update!https://t.co/kifTxzfLZq pic.twitter.com/gQLODBGJ6U
— WABetaInfo (@WABetaInfo) March 28, 2026
అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ప్రక్రియ సమయంలో వాట్సాప్‌కు గానీ, పేరంట్ కంపెనీ మెటాకు యూజర్ల మెసేజ్‌లు లేదా సమ్మరీలకు యాక్సెస్ ఉండదు. ఈ ఫీచర్ ఇతర ఏఐ టూల్స్ కన్నా మరింత సేఫ్ అని చెప్పొచ్చు.
యూజర్లకు ఫుల్ కంట్రోలింగ్ :
ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఫోర్సబుల్ ఫీచర్ కాదు. యూజర్లు ఏ చాట్ సమ్మరీలను చూడాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వొచ్చు. ప్రైవేట్ ప్రాసెసింగ్ డిఫాల్ట్‌గా నిలిచిపోతుంది. ఈ ఫీచర్ అవసరమైతే సెట్టింగ్స్‌లో ఎనేబుల్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు తమ డేటాపై పూర్తి కంట్రోల్ పొందవచ్చు.
బీటా టెస్టింగ్ :
ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లలో టెస్టింగ్ జరుగుతోంది. రెగ్యులర్ యూజర్లకు ఇంకా అందుబాటులో లేదు. టెస్టింగ్ అనంతరం ఎక్కువ మంది యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు.
యూజర్లకు బెనిఫిట్ ఏంటి? :
మెసేజింగ్ యాప్‌లలో యాక్టివిటీస్ పెరిగే కొద్దీ మెసేజ్ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ ఫీచర్ ఇక యూజర్లకు టైమ్ సేవింగ్‌తో పాటు లాంగ్ చాట్‌లను పదేపదే స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు.
