WhatsApp’s కొత్త ఫీచర్ : 8 మందితో Video Calls

  • Publish Date - April 28, 2020 / 10:36 AM IST

WhatsApp’s మీరు ఉపయోగిస్తుంటారా ? ఎక్కువ మందికి గ్రూప్ కాల్స్ చేయాలని అనుకుంటున్నారా ? అయితే..ఇలాంటి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కేవలం నలుగురికి మాత్రమే వీడియో కాల్ చేసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడా సంఖ్యను 8కి పెంచింది. అంటే ఒకేసారి 8 మందితో వీడియో, ఆడియో కాలింగ్ చేయవచ్చన్నమాట. యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది. సరికొత్త ఫీచర్లను తెస్తూ..మార్కెట్ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. 

భారతదేశమే కాకుండా..ఇతర దేశాల్లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తుందనే సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఇళ్లకే పరిమితం అయిపోయారు. పొద్దున లేస్తే..రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడిపే వారు..కాస్త రిలీఫ్ తీసుకుంటున్నారు. తమ మిత్రులు, బంధువులు, ఇతరులకు ఫోన్ లు చేస్తూ..పలకరించుకుంటున్నారు. ఎక్కడో దూరంలో ఉండే..వారు…ఏమి చేస్తున్నారో..వారిని చూసేందుకు అధిక శాతం వాట్సాప్ వీడియో కాల్, ఆడియో ఆప్షన్ ఎంచుకుంటున్నారు. 

 

ప్రజల ఆసక్తిని గమనించిన వాట్సాప్ యాజమాన్యం..సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు వాట్సాప్ అప్ డేట్ చేసింది. బీటా యూజర్ అయితే…వాట్సాప్ V2.20.133 వర్షన్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. బీటా, ఐ ఫోన్ వాట్సాప్ వెర్షన్ 2.20.50.25 బీటాలో వినియోగదారులు అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. త్వరలోనే భారత్ లోని యూజర్లకు అందించనుంది వాట్సాప్.