Apple Foldable Phone : వార్నీ.. రూ.3 లక్షలు పెట్టి ఐఫోన్ కొంటారా? ఫోల్డబుల్‌తో ఆపిల్ అసలు గేమ్ ఇదే!

Apple Foldable Phone : ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్‌ను ఎందుకు మార్కెట్లోకి తీసుకొచ్చింది? భారీ ధర ఉన్నా దీని వెనుక ఉన్న ప్రీమియం మార్కెట్, అప్‌గ్రేడ్ సైకిల్, బ్రాండ్ వాల్యూ, ఫోల్డబుల్ మార్కెట్ వృద్ధి వంటి ఆర్థిక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published on- September 11, 2026 / 03:00 PM IST

Apple Foldable Phone

  • ఆపిల్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి.. ఈ ధర ఎంతో తెలుసా?
  • ఫోల్డబుల్ ఫోన్‌తో ఆపిల్ అసలు టార్గెట్ ఏంటి? ధర కాదు.. ఇదే అసలు గేమ్
  • ఐఫోన్ నుంచి ‘ఫోన్ + టాబ్లెట్’ వరకు.. ఆపిల్ కొత్త ఫోల్డ్‌లో దిమ్మతిరిగే ఫీచర్లు

Apple Foldable Phone : ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఎందుకు తెచ్చింది? రూ.3 లక్షల ఫోన్ వెనుక అసలు స్టోరీ ఏంటి? ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎన్నో ఏళ్లుగా పెద్దగా మారని ఒక డిజైన్ ఉంది. అదే సాధారణ రెక్టాంగులర్ ఫోన్. మొన్నటివరకూ కెమెరా అప్ గ్రేడ్, ప్రాసెసర్ స్పీడ్ పెరుగుతుంది కొత్తగా ఏఐ ఫీచర్లు వస్తాయి. ఐఫోన్లలో అన్ని మారినా ఫోన్ రూపం మాత్రం దాదాపు అలాగే ఉంటుంది.

కానీ, ఇప్పుడు ఆపిల్ స్ట్రాటజీ పూర్తిగా మార్చేసింది. ఉన్నట్టుండి ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక కేవలం టెక్నాలజీ కారణమా? అంటే కాదు.. దీని వెనుక ఆపిల్ పెద్ద బిజినెస్ స్ట్రాటజీనే ఉందంట.. మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ ప్రకారం.. ఐఫోన్ డ్యుయో ఫోల్డబుల్ ఫోన్‌ల అమ్మకాలు 12 శాతం పెరిగేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందట..

ఖరీదైన ఫోన్‌కు కొత్త రీజన్ :

ప్రతి ఏడాదిలో కొత్త ఐఫోన్‌కు ధర పెంచడం ఏ కంపెనీకైనా ఇది కష్టం. ఎందుకంటే వినియోగదారుడు తన దగ్గర ఇప్పటికే మంచి ఫోన్ ఉంది.. కొత్తది ఎందుకు కొనాలి? అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్ దీనికి సరైన ఆన్సర్.. సాధారణ ఫోన్‌కు బదులుగా ఫోన్, చిన్న టాబ్లెట్ ఎక్స్ పీరియన్స్ అందించవచ్చు.

బిగ్ స్క్రీన్‌లో వీడియోలు చూడటం, చదవడం, మల్టీటాస్కింగ్ చేయడం వంటి పనులు చేసుకోవచ్చు. అంటే యూజర్ ఇది కేవలం మరో కొత్త ఫోన్ కాదని, కొత్త కేటగిరీ ప్రొడక్ట్ అనిపించేలా ఉంటుంది. అందుకే ధర పట్టించుకోకుండా సాధారణ ఐఫోన్‌తో పోల్చకుండా ప్రీమియం ప్రొడక్టుగానే చూపించవచ్చు.

Read Also : IFA 2026 Unusual Tech : ఇదో టెక్ మాయ.. ఒక్కో గాడ్జెట్ ఓ వింతే! IFA 2026లో మతిపొగొట్టే ఈ గాడ్జెట్లు ఎందుకు స్పెషల్?

అసలు లాభం ఎక్కడ? :
ఆపిల్‌కు ఫోల్డబుల్ ఫోన్ వల్ల 3 ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రీమియం ధర.. తక్కువ సంఖ్యలో ఫోన్లు అమ్మినా, ఒక్కో ఫోన్‌పై ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది బ్రాండ్ వాల్యూ.. కొత్త టెక్నాలజీని ముందుగా అందించే బ్రాండ్‌గా ఆపిల్ ఇమేజ్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకోవచ్చు.

ఇతర ఆపిల్ ప్రొడక్టులపై కూడా వినియోగదారుడి ఆసక్తిని పెంచుతుంది. మూడోది కొత్త మార్కెట్.. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్స్ వాటా ఇప్పటికీ చాలా చిన్నదే. కానీ, అదే ఆపిల్‌కు బిగ్ అడ్వాంటేజ్.. చిన్న మార్కెట్‌ను భారీ ప్రీమియం కేటగిరీగా మార్చగలిగితే భారీ బిజినెస్ వాల్యూను క్రియేట్ చేయొచ్చు.

ఆర్థిక వ్యవస్థకు లాభం ఏంటి? :
ఫోల్డబుల్ ఫోన్ ఒక్క ఆపిల్‌కే కాదు.. మొత్తం టెక్ ఎకానమీకి డిమాండ్‌ను పెంచుతుంది. డిస్‌ప్లేలు, చిప్స్, కెమెరాలు, బ్యాటరీలు, హింజ్‌లు, సాఫ్ట్‌వేర్ వంటి అనేక రంగాల్లో తయారీ, పెట్టుబడులు పెరగవచ్చు. పోటీ పెరిగితే కాలక్రమంలో టెక్నాలజీ చౌకగా మారే అవకాశం ఉంటుంది.

అందుకే ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురావడం వెనుక అసలు స్టోరీగా చెప్పవచ్చు.. ఎక్కువ ఫోన్లు అమ్మడం మాత్రమే కాదు. ఎక్కువ వాల్యూ ఉన్న కొత్త మార్కెట్‌ను క్రియేట్ చేయడం కూడా ముఖ్యమే.. ధర రూ.3 లక్షల దగ్గర ఉన్నా ఆపిల్ లెక్క మాత్రం లాంగ్ టైమ్ మార్కెట్‌పైనే ఉంది..