WWDC 2026 : పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీకి ఆపిల్ కొత్త బ్రహ్మాస్త్రం.. ‘ఆస్క్ టు బ్రౌజ్’తో పేరెంట్స్‌కు ఫుల్ కంట్రోల్!

WWDC 2026 : ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతకు సంబంధించి తల్లిదండ్రుల్లో ఆందోళనలను తగ్గించేందుకు ఆపిల్ WWDC 2026లో సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్‌ను 'ఆస్క్ టు బ్రౌజర్' పేరుతో రిలీజ్ చేసింది. ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలతో తెలుసుకుందాం.

Ask to Browse

  • పిల్లల ఫోన్‌పై ఇక పూర్తి కంట్రోల్!
  • ఇక పిల్లలకు నో సీక్రెట్ బ్రౌజింగ్
  • ఆపిల్ కొత్త రూల్‌తో పేరెంట్స్ ఫుల్ హ్యాపీ!
  • వెబ్‌సైట్ ఓపెన్ చేయాలంటే పర్మిషన్ తప్పనిసరి

WWDC 2026: ఆన్‌లైన్‌లో పిల్లల సేఫ్టీ కోసం ఆపిల్ కంపెనీ WWDC 2026 ఈవెంట్‌లో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఐఫోన్, ఐప్యాడ్ మ్యాక్ యూజర్ల కోసం ఆపిల్ కొత్త ‘ఆస్క్ టు బ్రౌజ్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కిడ్స్ సేఫ్టీ టూల్ iOS 27, iPadOS 27, macOS 27లతో ఆపరేటింగ్ సిస్టమ్‌లతో అందుబాటులో ఉంటుంది.

వాస్తవానికి, ఆస్క్ టు బ్రౌజ్ అనే ఫీచర్‌ పిల్లల కోసమే ప్రత్యేకంగా రూపొందించింది. టైమ్ అలవెన్సెస్, కమ్యూనికేషన్ అప్రూవల్స్ రీడిజైన్ స్క్రీన్ టైమ్ డాష్‌బోర్డ్‌తో సహా పేరెంటల్ కంట్రోల్స్‌ కోసం కంపెనీ ఈ ఫీచర్‌ను అందిస్తోంది.

ఆస్క్ టు బ్రౌజ్ ఏంటి? :
ఆస్క్ టు బ్రౌజ్ అనేది పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీ కోసం క్రియేట్ చేసిన కొత్త పేరెంట్స్ కంట్రోలింగ్ టూల్. ఈ ఫీచర్‌తో ఏదైనా వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసేందుకు పిల్లలకు ముందుగా తల్లిదండ్రుల పర్మిషన్ అవసరం ఉంటుంది.

ఈ ఫీచర్ ఆపిల్ ఇప్పటికే ఉన్న ఆస్క్ టు బై సిస్టమ్ మాదిరిగానే వర్క్ అవుతుంది. అందులో పిల్లలు ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా యాప్‌లో కొనుగోలు చేసే ముందు పేరెంట్స్ అప్రూవల్ అవసరం.

ఆస్క్ టు బ్రౌజ్ ఆన్ చేసి ఉంటే.. పిల్లలు సఫారీ బ్రౌజర్ ద్వారా విజిట్ చేయొచ్చు. ఏ కొత్త వెబ్‌సైట్ అయినా వారి పేరెంట్స్ లేదా గార్డియన్స్ ఒక రిక్వెస్ట్ పంపమని అడుగుతుంది. ఆ తర్వాత పేరెంట్స్ యాక్సెస్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవ్వొచ్చు.

Read Also : WWDC 2026 Siri AI : వావ్.. ఆపిల్ సిరి ఇప్పుడు సిరి AI.. ఇకపై చదవగలదు.. మనిషిలా మాట్లాడగలదు.. అంతా ఒకేచోట!

పేరెంట్స్ ఫస్ట్ తమ పిల్లల కోసం ఒక చైల్డ్ అకౌంట్‌ క్రియేట్ చేయాలి. అకౌంట్ యాక్టివేట్ అయ్యాక వయస్సుకు తగిన ప్రొటెక్షన్లు ఆటోమేటిక్‌గా డివైజ్‌కు అప్లయ్ అవుతాయి. ‘ఆస్క్ టు బ్రౌజ్’ ఆన్ చేసి ఉంటే.. పిల్లలు పేరెంట్స్ అప్రూవల్ ఉన్న వెబ్‌సైట్‌లను మాత్రమే యాక్సెస్ చేయగలరు.

కానీ, ఏవైనా కొత్త సైట్‌లకు పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి. ఈ కొత్త ఫీచర్ తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీని మానిటరింగ్ చేసేందుకు వీలుంటుంది.

లభ్యత :
ఆస్క్ టు బ్రౌజ్ అనే ఫీచర్ పిల్లల సేఫ్టీ కోసం ఆపిల్ అందిస్తోంది. iOS 27, iPadOS 27, macOS 27 అప్‌డేట్‌ల ద్వారా సరికొత్త ఫీచర్లను కంపెనీ ప్రవేశపెడుతోంది. అంటే.. మీ ఐఫోన్ లేదా ఆపిల్ డివైజ్‌కు కొత్త అప్‌డేట్ వచ్చిన వెంటనే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.