Samsung Galaxy Z Flip 6
Xiaomi 14 Civi : కొత్త షావోమీ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం అమెజాన్‌లో షావోమీ 14 సివి రూ. 16వేల కన్నా ఎక్కువ ధర తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్, మల్టీఫేస్ కెమెరాలతో డిజైన్ అందిస్తుంది. ఈ స్పెషిఫికేషన్లతో స్మార్ట్‌ఫోన్ పాలిష్డ్, ప్రీమియం ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది.
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, ఫ్రంట్ సైడ్ డ్యూయల్ 32MP కెమెరాలు, 4,700mAh బ్యాటరీతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. అమెజాన్‌లో షావోమీ 14 సివి డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
షావోమీ 14 సివి అమెజాన్ డీల్ :
ప్రస్తుతం షావోమీ 14 సివి కేవలం రూ.26,999కే లిస్ట్ అయింది. రూ.42,999 లాంచ్ ధరపై రూ.16వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అడ్వాన్స్ పేమెంట్ చేయాలనుకునే వారికి ఈ-కామర్స్ సైట్ నెలకు రూ.949 మాత్రమే ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
అంతేకాకుండా, మీ పాత స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడింగ్ చేయొచ్చు. షావోమీ 14 సివి కొనుగోలుపై డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ-కామర్స్ బ్రాండ్ రూ.25,550 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా అందిస్తోంది.
షావోమీ 14 సివి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
షావోమీ 14 సివి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇంకా, ఈ షావోమీ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీని కూడా అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.55-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 1.5K రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. సూర్యకాంతిలో ఫోన్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. షావోమీ 14 సివి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇంకా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ రెండు 32MP కెమెరాలు ఉన్నాయి.