×
Ad

Xiaomi 14 Civi : షావోమీ 14 Civi ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 9వేలు డిస్కౌంట్, ఈ డీల్ ఎలా పొందాలంటే?

Xiaomi 14 Civi : షావోమీ కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం అమెజాన్‌లో అతి చౌకైన ధరకే లభిస్తోంది. షావోమీ 14 సివి ప్రారంభ ధర రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 22, 2026 / 04:59 PM IST

Xiaomi 14 Civi

  • భారత్‌లో షావోమీ 14 సివి ప్రారంభ ధర రూ. 42,999
  • అమెజాన్‌లో రూ.26,249కి లిస్టింగ్, రూ.16,750 ఫ్లాట్ డిస్కౌంట్
  • స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 4700mAh ఫాస్ట్-ఛార్జ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరాలు

Xiaomi 14 Civi : కొత్త షావోమీ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్‌లో భారీ తగ్గింపుతో షావోమీ 14 సివి ఫోన్ లభ్యమవుతోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు గతంలో కన్నా చాలా తక్కువ ధరకే ఈ షావోమీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. స్టైలిష్, కాంపాక్ట్ మోడల్‌ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 9వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది. షావోమీ 14 సివి ఫోన్ తక్కువ ధరలో మంచి ఫోన్ కొనుగోలు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది. ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ద్వారా అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. షావోమీ 14 సివి ఫోన్ డీల్ అమెజాన్‌లో ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

షావోమీ 14 సివి అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో షావోమీ 14 సివి ఫోన్ మొదట రూ.42,999 బేస్ ధరకు లాంచ్ అయింది. అమెజాన్ ఇప్పుడు నెలకు రూ.1,195 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. ఈ షావోమీ ఫోన్ ధర తగ్గింపుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ మోడల్‌ బట్టి రూ. 30,550 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు.

Read Also : Vivo V70 Elite 5G : కొత్త వివో ఫోన్ కావాలా? వివో V70 ఎలైట్ 5G రేంజే వేరబ్బా.. ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఎందుకు కొనొద్దు? ఫుల్ డిటెయిల్స్

షావోమీ 14 సివి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
షావోమీ 14 సివి ఫోన్ 6.55-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. హైబ్రైట్‌నెస్ లెవల్స్, వీడియోలు లేదా బ్రౌజింగ్ కోసం మంచి కలర్ అవుట్‌పుట్‌కు సపోర్టు ఇస్తుంది. రోజువారీ వినియోగానికి ఫ్రంట్ సైడ్ స్ట్రాంగ్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది.

షావోమీ 14 సివి ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 4,700mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. షావోమీ 14 సివి రియర్ సైడ్ 3 కెమెరాలు ఉన్నాయి.

ఈ కెమెరాలతో ఫోటోలు, క్లోజ్ షాట్లు, వైడ్ సీన్‌లు వస్తాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 2x షాట్‌ల కోసం 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ రెండు 32MP కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలు క్యాప్చర్ చేయొచ్చు.