Xiaomi 17T Series : షావోమీ లవర్స్ గెట్ రెడీ.. షావోమీ 17T, 17T ప్రో వచ్చేస్తున్నాయ్.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలు

Xiaomi 17T Series : షావోమీ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఈ నెల చివర్లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో షావోమీ 17T సిరీస్‌ను లాంచ్ చేయనుంది. పూర్తి వివరాలివే..

Xiaomi 17T And 17T Pro ( Image Credit : AI )

  • షావోమీ 17T 6.59-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే
  • షావోమీ 17T ప్రోలో 6.83-అంగుళాల 1.5K AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే
  • మీడియాటెక్ డైమన్షిటీ 9500 చిప్‌సెట్‌ కూడా ఉండొచ్చు

Xiaomi 17T Series : షావోమీ నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ రాబోతుంది. ఈ నెలాఖరులో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో షావోమీ 17T సిరీస్‌ లాంచ్ కానుంది. గ్లోబల్ లాంచ్ తర్వాత, షావోమీ 17T, షావోమీ 17T ప్రో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ రెండు ఫోన్‌లు దేశీయ ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో షావోమీ 17, షావోమీ 17 అల్ట్రాతో లభ్యం కానున్నాయి. భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో షావోమీ 17 మ్యాక్స్‌ను కూడా రిలీజ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. షావోమీ 17T సిరీస్‌లోని ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం..

షావోమీ 17T, 17T ప్రో త్వరలో భారత్‌లో లాంచ్ :
టిప్‌స్టర్ ప్రకారం.. షావోమీ 17T, షావోమీ 17T ప్రో ఫోన్లు మే 28న ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కానున్నాయి. త్వరలో భారత మార్కెట్లో కూడా లాంచ్ కానున్నట్లు అంచనా. రెడ్‌మి టర్బో 5 తర్వాత ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే, షావోమీ 17T సిరీస్ గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కానీ, గ్లోబల్ లాంచ్‌కు ఇంకా కొన్ని వారాలే ఉంది.

Read Also : Redmi K100 Pro Max : రెడ్‌మి K100 ప్రో మ్యాక్స్ దూసుకొస్తోంది.. లాంచ్‌కు ముందే సీక్రెట్ ఫీచర్లు లీక్..!

షావోమీ 17T, షావోమీ 17Tప్రోతో పాటు, రాబోయే వారాల్లో చైనాలో లాంచ్ కానున్నట్లు ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. షావోమీ 17 మ్యాక్స్‌ను కూడా కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ 3 మోడళ్లు భారత మార్కెట్లో లాంచ్ అయితే షావోమీ 17, షావోమీ 17 అల్ట్రాలతో అందుబాటులో ఉంటాయి. దాంతో దేశంలో ఫ్లాగ్‌షిప్ మోడళ్ల మొత్తం సంఖ్య ఐదుకు చేరుతుంది.

షావోమీ 17T, 17T ప్రో ధర (అంచనా) :
షావోమీ 17T, 17T Pro స్పెసిఫికేషన్లు ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. షావోమీ 17T ఫోన్ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 749 (సుమారుగా రూ. 83,000) కాగా, షావోమీ 17T ప్రో ధర EUR 999 (సుమారుగా రూ. 1,11,000)గా ఉండవచ్చు.

షావోమీ 17T, 17T ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
షావోమీ 17T ఫోన్ 6.59-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ 460ppi పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి. షావోమీ 17T ప్రో ఫోన్ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. 1280×2772 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 447ppi పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.

షావోమీ 17Tలో 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉండొచ్చు. అయితే షావోమీ 17T ప్రోలో 3nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 9500 చిప్‌సెట్‌ను అమర్చవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో 12GB LPDDR5x ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 4.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది.